పెళ్ళి తర్వాత కూడా నా కోరిక నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తా…తమన్నా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన తమన్నా ఆ సినిమాలో తన అందంతోపాటు నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

ఈ సినిమాలో తమన్నా అందానికి, నటనకు దర్శక నిర్మాత లు కూడా బాగా ఆకర్షితులు అయ్యారు. అందువల్ల టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది.

 తెలుగు, తమిళ్ భాషలలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

యువ హీరోయిన్ల సంఖ్య పెరుగుతుండటంతో తమన్నా కి అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. అయినప్పటికీ మంచి కథతో కూడుకున్న సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.

ఇక తమన్నా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇటీవల హిందీలో విడుదలైన ‘ లేడీ బౌన్సర్ ‘ సినిమా తమన్నకు ఆశించిన ఫలితాన్ని

ఇవ్వలేకపోయింది. ఇక ప్రస్తుతం తెలుగులో ‘ గుర్తుందా శీతాకాలం ‘ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ప్రస్తుతం తమన్నా ఈ సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రమోషన్లలో భాగంగా పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల తమన్నా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ…తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. గత కొంతకాలంగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని… తాను పెళ్లి చేసుకోవాలని

నిర్ణయించుకున్నప్పుడు తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తనకు నిర్మాతగా మారి మంచి గుర్తింపు పొందాలని కోరిక ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది.

పెళ్లి తర్వాత హీరోయిన్గా చేసే ఆలోచనలు తనకి లేవని… అయితే ఒక మంచి సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలని అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది.