స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారిన లేటెస్ట్ భారీ చిత్రం “పుష్ప ది రూల్” కోసం తెలిసిందే.
కాగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మాసివ్ చిత్రం పుష్ప 1 కి సీక్వెల్ గా వస్తుందని తెలిసిందే.
అయితే ఈ భారీ సినిమా కి ఎప్పుడు నుంచొ ఓవర్సీస్ మార్కెట్ నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయి టాక్ ఉంది.
అంతే కాకుండా అప్పట్లోనే 500 కోట్ల మేర ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పాన్ ఇండియా లెవెల్లో జరుపుతుంది అని టాక్ వచ్చింది.
అంతే కాకుండా అప్పట్లోనే 500 కోట్ల మేర ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పాన్ ఇండియా లెవెల్లో జరుపుతుంది అని టాక్ వచ్చింది.
ఈ సినిమాకి ఏకంగా 1000 కోట్లు బిజినెస్ అంటూ కొన్ని ఊహాగానాలు భారీ లెవెల్లో స్పీడ్ అవుతున్నాయి.
పైగా ఈ మాసివ్ ఫిగర్ అల్లు అర్జున్ నుంచే వచ్చింది అని అంతకు మించి తగ్గొద్దు అని చెప్పాడని కూడా అంటున్నారు.
కాగా ఈ మొత్తం అయితే థియేట్రికల్ బిజినెస్ సహా టోటల్ ఆడియో, నాన్ థియేట్రికల్, సాటిలైట్ మరియు అన్ని భాషల ఓటిటి హక్కులు కలిపి డిమాండ్ చేసాడట.
ఇది ఒకింత ఊహించని లెవెల్ అయినా లాస్ట్ టైం అయితే టాలీవుడ్ ప్రైడ్ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ కి టోటల్ గా 750 కోట్ల మాసివ్ బిజినెస్ జరుపుకుంది.
దీనితో ఈ లెక్కన పుష్ప 2 కి ఉన్న హైప్ తో ఎందుకు అవ్వదు అనే కోణం కూడా ఉంది. కానీ ఓవరాల్ గా 1050 కోట్ల బిజినెస్ అనేది షాకింగ్ మొత్తం అని చెప్పి తీరాలి.