RRR సినిమాకు గాను ఇంతకుముందే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో నాటు నాటు పాట అవార్డు అందుకోవడంతో ఇప్పుడు ఆస్కార్ నామినేషన్స్ కు మరింత సులభం అయింది.
అయితే మొదటినుంచి కూడా ఈ తరహాలో క్రేజ్ అందుకోవడానికి RRR టీం ఏ స్థాయిలో ఖర్చు చేసింది అనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి ఆ రేంజ్ లో ఖర్చు చేస్తే అవార్డులు వస్తాయి అంటే హాలీవుడ్ లో చాలామంది ఎక్కువ స్థాయిలో ఇవ్వగలరు.
కానీ ఆ రూట్లో అవార్డులు సంపాదించడం అనేది అసలు సాధ్యం కానిరి. అవార్డుల నామినేషన్ ఎలా జరుగుతాయి వాటికి ఎవరు సెలెక్ట్ చేస్తారు
అనే విషయం ఇప్పటికీ కూడా ఏ హాలీవుడ్ యాక్టర్స్ కు దర్శకులకు తెలియదు. ఆ విధంగా అకాడమీ అవార్డ్స్ 90 ఏళ్ళుగా సాగుతున్నాయి.
అయితే రాజమౌళి టీమ్ మాత్రం ఒక విషయంలో బాగానే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.
సినిమాను మరింత ప్రమోట్ చేసే విధంగా ఇంగ్లీష్ మీడియాతో కలిసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ప్రమోషన్స్ కు మాత్రం ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.
మంచి కంటెంట్ ఉన్నప్పుడు ప్రమోట్ చేసుకోవడంలో తప్పులేదు. ఆ విధంగా సినిమాలో సినిమాపై అందరికీ ఫోకస్ పడేలా వెరైటీ అని మీడియాని బాగా ఉపయోగించుకున్నారు.
దాదాపు 50 కోట్ల వరకు సినిమాను హైలెట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ రేంజ్ లో ఏమి కాలేదని తెలుస్తోంది.
ఇక రాజమౌళి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమాపై హాలీవుడ్ రేంజ్ ఫోకస్ పడాలని కోరుకున్నాడు. ఆ రేంజ్ లో అయితే సినిమా క్లిక్కయ్యింది.