ఎన్నిసార్లు నీళ్లు తాగిన దాహం తీరలేదా… బహుశా ఈ సమస్య కారణం కావచ్చు!

 మన శరీరంలోని జీవక్రియలను సక్రమంగా జరగాలి అంటే తప్పనిసరిగా నీరు ఎంతో కీలకంగా మారుతుంది.

 అందుకే ప్రతిరోజు మన శరీర ప్రక్రియలకుఅవసరమయ్యే నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇలా ప్రతిరోజు 8 క్లాసుల వరకు నీటిని తీసుకోవటం వల్ల

 మన శరీరం డిహైడ్రేషన్ కి గురి కాకుండా అలాగే మన శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరుగుతాయని చెబుతారు.

 అయితే కొందరు మాత్రం మాటిమాటికి నీళ్లు తాగుతున్న కూడా వారికి దాహం తీరకుండా అతిగా నీళ్లు తాగుతూ ఉంటారు.

 ఇలా అతిగా దాహం వేస్తూ ఉంటే మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారని సంకేతం.

 మధుమేహంతో బాధపడేవారిలో అతిగా దాహం వేస్తూ ఉంటుంది ఎప్పుడైతే రక్తంలో చక్కర శాతం పెరుగుతుందో అప్పుడు ఆ చక్కెరను యూరిన్ రూపంలో శరీరం బయటకు పంపుతుంది.

 ఇలా తరచూ యూరిన్ వెళ్లడం వల్ల మన శరీరం కాస్త డిహైడ్రేషన్ కి గురవటంతో అతిగా దాహం వేస్తుంది. అదేవిధంగా రక్తపోటు సమస్యతో బాధపడే వారిలో కూడా అధికంగా నీరు దాహం వేస్తుంది.

 మన శరీరంలో రక్తపోటు కనుక పెరిగితే శరీరం నుంచి ఎక్కువ మొత్తంలో చెమటలు బయటకు వెళ్ళబడతాయి

 ఇలా శరీరం మొత్తం చెమటలను బయటకు పంపించడంతో మన శరీరం నీటి శాతాన్ని కోల్పోతుంది తద్వారా మనకు అధికంగా దాహం వేస్తుంది.

 ఇక డిహైడ్రేషన్ సమస్య అనేది ఎప్పుడైతే మన శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటుందో ఆ సమయంలో ఈ డిహైడ్రేషన్ ఏర్పడుతుంది.

 అయితే డిహైడ్రేషన్ అనేది మనం సరిగా నీళ్లు తాగకపోయినా కలుగుతుంది ఇలా డిహైడ్రేషన్ కారణంగా మనకు దప్పిక వేసి నీళ్లు తాగుతున్నప్పటికీ

 ఆ దాహం తీరదు అందుకే డిహైడ్రేషన్ అయిన సమయంలో నీటిని కాకుండా కాస్త పనుల రసాలను ఓఆర్ఎస్ వంటి ద్రావణాలను తీసుకోవడం వల్ల ఈ డిహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు.