“వాల్తేరు వీరయ్య” 2 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయ్?

టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం “వాల్తేరు వీరయ్య” భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ అందుకోగా రెండో కూడా సూపర్ హోల్డ్ తో దుమ్ము లేపుతుంది.

 అయితే వాల్తేరు వీరయ్య చిత్రం మొదటి రోజు వసూళ్లు మేకర్స్ రివీల్ చేయలేదు కానీ ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్ నుంచి సినిమా రెండు రోజుల వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి.

 మరి వాల్తేరు వీరయ్య రెండు రోజుల్లో అయితే భారీ వసూళ్లే రిజిస్టర్ చేసినట్టుగా తెలుస్తుంది.

 మరి ఈ చిత్రం రెండు రోజులకి గాను వరల్డ్ వైడ్ గా 75 నుంచి 80 కోట్ల మేర గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వీటిలో 38 నుంచి 40 కోట్ల మేర షేర్ ని చిత్రం రాబట్టినట్టుగా టాక్.

 మరి ఇందులో ఒక్క యూఎస్ నుంచే 1.3 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది. అలాగే సీడెడ్ లో ఆరున్నర కోట్లు రాబట్టగా నైజాం లో 12 కోట్ల మేర షేర్ ని రాబట్టింది.

 ఇక మిగతా ఏపీలో 15 నుంచి 17 కోట్లు ఉండొచ్చని అంచనా ఇలా ఓవరాల్ గా కర్ణాటక ఇతర ఏరియాల్లో చూసినట్టు అయితే వాల్తేరు వీరయ్య బలంగా కనిపిస్తుంది.

 ఇక ఈరోజు సంక్రాంతి సహా రేపు కనుమ హాలిడే కూడా భారీగా ప్లస్ కానుంది, ఈ రెండు రోజుల్లో వాల్తేరు వీరయ్య ఏం చేస్తాడో చూడాలి

 ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించగా శృతి హస్సన్ మరియు క్యాథెరిన్ లు హీరోయిన్స్ గా నటించారు.

 అలాగే మైత్రి మేకర్స్ నిర్మాణం వహించారు.