పాన్ కార్డ్ ను పోగొట్టుకున్నారా.. సులువుగా పాన్ కార్డ్ ను ఎలా పొందొచ్చంటే?

 మనలో చాలామంది పాన్ కార్డ్ ను కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో చేసే చిన్నచిన్న తప్పుల వల్ల పాన్ కార్డును పోగొట్టుకోవడం జరుగుతుంది.

 అయితే పోగొట్టుకున్న పాన్ కార్డును తిరిగి పొందే విషయంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు.

  ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేసేవాళ్లకు పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ ద్వారా పాన్ కార్డ్ ను మళ్లీ ప్రింట్ తీసుకునే ఛాన్స్ ఉంది.

 పాన్ కార్డును పోగొట్టుకున్న వాళ్లు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ కు వెళ్లి అప్లికేషన్ ను ఎంచుకుని రీప్రింట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.

అవసరమైన వివరాలను నమోదు చేయడం ద్వారా పాన్ కార్డ్ రీ ప్రింట్ పొందే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేసిన తర్వాత టోకెన్ నంబర్ ను పొందవచ్చు.

 డైరెక్ట్ గా వెళ్లి డాక్యుమెంట్లను సమర్పించడంతో పాటు ఈ సైనింగ్ లేదా ఈ కేవైసీ ద్వారా పాన్ కార్డ్ రీప్రింట్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని

 కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆధార్ ఉంటే మాత్రమే ఈ కేవైసీ సర్వీస్ లను పొందే అవకాశం ఉంటుంది.

 వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడం ద్వారా పాన్ కార్డ్ రీప్రింట్ ను పొందే అవకాశం అయితే ఉంటుందనే సంగతి తెలిసిందే.

 ఈ విధంగా చేసిన తర్వాత 15 నుంచి 20 రోజులలో కొత్త పాన్ కార్డ్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి.

 ఈ విధంగా సులువుగా డూప్లికేట్ పాన్ కార్డ్ ను పొందవచ్చు. 50 రూపాయలు పే చేయడం ద్వారా పాన్ కార్డ్ రీప్రింట్ పొందే అవకాశాలు అయితే ఉంటాయనే సంగతి తెలిసిందే.