గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే.
దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఓ భారీ పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతూ ఉండగా పవన్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
మరి ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉండగా ఆల్రెడీ కొంతమేర కంప్లీట్ కూడా అయ్యింది.
అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్ లు టీజర్ లు పవర్ గ్లాన్స్ లు అంటూ చాలానే వచ్చి గట్టి హైప్ సెట్ చేసాయి.
దీనితో హిందీలో కూడా సినిమాకి మంచి ధర పలకగా ఇప్పుడు అసలు ట్రీట్ కోసం సినీ వర్గాల్లో మరోసారి గట్టి బజ్ వినిపిస్తుంది.
ఈ జనవరి 26నే సినిమా నుంచి అసలు సిసలు మెయిన్ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు తాజా సమాచారం. దీనితో సినిమాపై ఓ క్లారిటీ కూడా వస్తుందని చెప్పాలి.
దీనితో ఈ క్రేజీ టాక్ ఒక్కసారిగా అభిమానుల్లో ఊపందుకోగా ఇక ఆరోజు కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ రికార్డులు బ్రేక్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు.
ఇంకా ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మరియు నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఈ భారీ సినిమాకి కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. అలాగే ఏ ఎం రత్నం నిర్మాణం అందిస్తున్నారు.