దాదాపు మన అందరి ఇంటి పెరట్లో కచ్చితంగా ఉండే జామ చెట్టు ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.
జామకాయ మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఎలా సహాయపడుతుందో అలాగే జామ ఆకులోని ఔషధ గుణాలు చర్మ సమస్యలను,
జుట్టు రాలడాన్ని అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది కారణం జామ ఆకుల్లో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్
యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా లభించడమే. జామ ఆకులతో జుట్టు సమస్యలను ఎలా పరిష్కరించవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు తెల్లబడడం వంటి సమస్యలకు కారణాలు అనేకం కారణాలు ఏవైనా ఇప్పుడు చెప్పబోయే జామాకు చిట్కాను ఉపయోగిస్తే
సహజ పద్ధతిలో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.మొదట జామ ఆకులను మరిగించిన తరువాత వచ్చిన కషాయంలో రెండు టేబుల్ స్పూన్లు గోరింటాకు పొడి,
స్పూన్ మెంతి పొడి, స్పూన్ మందారం పువ్వుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీళ్లతో తల స్నానం చేయాలి
ఇలా నెలలో మూడు లేదా నాలుగు సార్లు చేస్తే సహజ పద్ధతిలో జుట్టు రాలడాన్ని అరికట్టి అందమైన ఓత్తైన కురులు పొందవచ్చు.
ఇవే కాకుండా జామ ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు తరచూ చిగుళ్ల వాపు, నోటి ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడేవారు
జామ ఆకుల కషాయాన్ని రోజుకు రెండుసార్లు పుక్కిలిస్తే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోట్లో ప్రమాదకర బ్యాక్టీరియాను నశింపజేసి నోటి దుర్వాసనను,
చిగుళ్ల వాపు, చిగుళ్ల వెంబడి రక్తం కారడం, దంత క్షయం వంటి సమస్యలకు సులువుగా చెక్ పెట్టవచ్చు. అలాగే మొటిమలు సమస్యతో బాధపడేవారు
జామ ఆకులు తులసి ఆకులను మెత్తటి మిశ్రమంగా చేసి అందులో చిటికెడు పసుపు కలిపి ముఖ చర్మంపై సున్నితంగా రాసుకుంటే చర్మం పై మొటిమలు, మచ్చలు తగ్గి సహజ మెరుపును సంతరించుకుంటుంది.