ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే సినిమా సెలబ్రిటీల నుంచి మొదలుకొని సీరియల్ ఆర్టిస్టులు
ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ ప్రజలు కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యూట్యూబ్ ద్వారా కూడా మరింత ఆదాయాన్ని అందుకుంటున్నారు
ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేరళ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ కనుక నడుపుతూ ఉంటే
అది ప్రభుత్వ రూల్స్ ను ఉల్లంఘించినట్లేనని కేరళ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. యూట్యూబ్ ఛానెల్‌ల ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం రాకుండా చేసేందుకు ప్రభుత్వం
ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 3న రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభించడానికి ప్రస్తుత నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కళాత్మకమైన పనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి అనుమతి కోరుతూ ఫైర్ సర్వీస్ దాఖలు చేసిన దరఖాస్తుకు ప్రతిస్పందనగా ఈ ఆదేశాలను జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ చానళ్లు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ఆ జీవోలో పేర్కొంది. ఫైర్ ప్రొటెక్షన్ సర్వీస్‌కు అనుమతి నిరాకరిస్తూ ఆర్డర్ జారీ చేసింది..
ఈ విధంగా ప్రభుత్వ శాఖలలో పని చేస్తూ యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం ద్వారా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లేనని అధికారులు వెల్లడించారు.
ఇలా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా యూట్యూబ్ ఛానల్ కనుక నిర్వహిస్తే సదరు ఉద్యోగులపై వేటు తప్పదని తెలిపారు.