రైతులకు శుభవార్త త్వరలోనే పీఎం కిసాన్ 13 విడత డబ్బులు జమ!

కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చారు.

 కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చారు.

 ఇప్పటికే డబ్బులను 12 విడుదల చొప్పున రైతుల ఖాతాలో జమ చేశారు.

 ప్రతి విడుదలను 2000 రూపాయలు చొప్పున నేరుగా రైతుల ఖాతాలో డబ్బును జమ చేస్తున్నారు.

 ఈ క్రమంలోనే 13వ విడతకు సంబంధించిన పిఎం కిసాన్ నిధి యువజన డబ్బులను మరి కొద్ది రోజులలో రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టు తెలుస్తుంది.

 హోలీ పండుగను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బును రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది.

 ఈ క్రమంలోనే మార్చి 8వ తేదీ హోలీ పండుగను పురస్కరించుకొని అదే రోజున రైతుల ఖాతాలో 13వ విడత జమ చేయనున్నట్టు సమాచారం.

 ఇకపోతే ఈ 13వ విడతలో భాగంగా లబ్ధిదారుల జాబితాలో ముందుగా మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

 అయితే మీరు ఈ పథకానికి అర్హులు కాదు తెలుసుకోవాలంటే ముందుగా మీరు అధికారక వెబ్సైట్ https://pmkisan.giv.in/ ఓపెన్ చేసి పేమెంట్ సక్సెస్ ట్యాబ్ అనే బటన్ ఉంటుంది.

  దాని కుడి వైపు డాష్ బోర్డు అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే ఒక కొత్త పేస్ ఓపెన్ అవుతుంది అందులో మీ రాష్ట్రం జిల్లా నియోజకవర్గ తదితర విషయాలను నమోదు చేయాలి.

 ఇలా నమోదు చేసిన తర్వాత షో అనే బటన్ పై క్లిక్ చేస్తే అందులో మీ పేరు ఉందా లేదా మీరు ఈ పథకానికి అర్హుల కాదా అనే విషయం తెలిసిపోతుంది.