సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.
బటెక్ చదివే విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది.
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 570 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ.22 లక్షల వేతనం లభించనుంది.ఈ నెల 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కాగా అర్హత,
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ప్రభుత్వ రంగ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ఈ ఉద్యోగ ఖాళీలకు గట్టి పోటీ ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వేర్వేరు ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది.ప్రాజెక్ట్ ఇంజనీర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలు 300 ఉండగా
సర్వీస్ అండ్ ఔట్‌రీచ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ లీడ్, మాడ్యూల్ లీడ్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు 200 ఉన్నాయి.
సర్వీస్ & ఔట్‌రీచ్ మేనేజర్, ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్, నాలెడ్జ్ పార్టనర్, ప్రోగ్రామ్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 40 ఉన్నాయి.
ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలు మాత్రం 30 ఉన్నాయని సమాచారం అందుతో30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అనుభవం కూడా ఉండాలి.
నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. .