పెదవుల అందాన్ని ,ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

 ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసే పెదాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

 మరి ముఖ్యంగా వానాకాలం, శీతాకాలం లాంటి తడి వాతావరణం కారణంగా పెదాలు పొడి వారడం, చీలడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.

 ఈ సమస్య తీవ్రమైన నొప్పితో పాటు అందవికారంగా కూడా కనిపిస్తుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా పెదాల విషయంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే

  పెదవుల ఆరోగ్యాన్ని కాపాడడం తో పాటు ముఖ సౌందర్యాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు మరి పెదాలను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.

 చలికాలంలో పొడి బారిన పెదాలకు లిప్‌బామ్స్‌ వంటి పెట్రోలియం ఉత్పత్తులు, ప్రమాదకర కెమికల్స్ వాడటం కంటే సహజ సిద్ధంగా లభించే వెన్న,

 ఆలివ్ ఆయిల్‌ని, కొబ్బరి నూనె వంటి వాటితో పెదవులను మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ సరిగా జరిగి పెదవులు పొడిబారడం తగ్గుతుంది.

 అలాగే విటమిన్ ఏ,ఈ ఎక్కువగా ఉన్న క్యారెట్, దోసకాయ, పుచ్చకాయ వంటి పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటే పెదవుల్లో తేమశాతం తగ్గదు

 దాంతో పెదాలు పొడిబారడంవంటి సమస్యలు తొలగి గులాబీ రంగు పెదాలు మీ సొంతం. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ ,ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి కావున పెదవుల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది.

 ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని అందులో తగినంత నెయ్యి వేసి ఆ మిశ్రమాన్ని పొడిబారిన పెదాలపై మర్దన చేసుకుంటే పెదవులపై ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.

 అందమైన గులాబీ రంగు పెదాల కోసం బాదం నూనెలో తేనె, చిటికెడు చక్కెర కలిపిన మిశ్రమాన్ని పెదాలపై సున్నితంగా మర్దన చేసుకుంటే పెదాలపై ఉండే మృత చర్మాన్ని తొలగించి పెదాలకు తేమను అందిస్తుంది.

 ఇలా ప్రతిరోజు చేయడం వల్ల అందమైన గులాబీ రంగు పెదాలను పొందవచ్చు.కొన్నిగులాబీ రేకులను పాలలో నానబెట్టి మెత్తగా నూరి పెదాలపై సున్నితంగా మసాజ్ చేయాలి ఇలా చేస్తే పెదాలు పగలకుండా మృదువుగా కాంతివంతంగా ఉంటాయి.

 కలబంద గుజ్జును ప్రతిరోజు సున్నితమైన పెదవులకు మర్దన చేసుకుంటే పెదవులు తేమగా మృదువుగా తయారవుతాయి