ఫైనల్ గా సామ్ “శాకుంతలం” కి కొత్త డేట్ వచ్చింది.!

 ప్రస్తుతం టాలీవుడ్ దగ్గర మంచి అంచనాలు నెలకొన్న టాలీవుడ్ చిత్రాల్లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత

 మెయిన్ లీడ్ లో నటించిన భారీ పాన్ ఇండియా సినిమా “శాకుంతలం” కూడా ఒకటి.

 కాగా ఈ సినిమాని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించగా ఈ సినిమాని తాను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో అయితే తీశారు.

  ఇది వరకే వచ్చిన ఈ చిత్రం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా సినిమా రిలీజ్ ని కూడా ఈ ఫిబ్రవరి 17కి ఫిక్స్ చేశారు.

 ప్రతిరోజు  కానీ ఈ సినిమా మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతూ వస్తుంది. అలాగే ఈ డేట్ నుంచి కూడా సినిమాని మేకర్స్ వాయిదా వేయగా ఇపుడు చిత్ర యూనిట్ సరికొత్త రిలీజ్ డేట్ ని తాము రివీల్ చేశారు.

 మరి ఈ సినిమా ఈసారి వచ్చే ఏప్రిల్ 14న గ్రాండ్ ఫా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

 మరి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆ రోజు రిలీజ్ కానుంది. ఇక ఈ డేట్ కి అయినా సినిమా వస్తుందో లేదో అని కొందరు డౌట్ పడుతున్నారు.

 ఇక ఈ భారీ సినిమాలో సమంత తో పాటుగా దేవ్ మోహన్ మోహన్ బాబు, అల్లు అర్హ తదితరులు కీలక పాత్రల్లో నటించగా మణిశర్మ సంగీతం అందించారు.

 అలాగే దిల్ రాజు మరియు నీలిమ గుణ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.