ఫైనల్ గా మహేష్ సినిమా రీస్టార్ట్ కానుందట.!

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ హీరోగా

ఇప్పుడు మాటల మాంత్రికుడు టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైనటువంటి దర్శకుడు త్రివిక్రమ్ తో తన కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఈ చిత్రం అయితే సుమారు 200 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కనుండగా ఈ సినిమాలో ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ ని అయితే విజయవంతంగా మేకర్స్ కంప్లీట్ చేశారు.

ఇక రెండో షెడ్యూల్ స్టార్ట్ చేసేసరికి అయితే చాలా ఆలస్యం కావడం మహేష్ జీవితంలో కూడా కొన్ని తీరని విషాదాలు చోటు చేసుకున్నాయి.

దీనితో షూటింగ్ మరింత ఆలస్యం కాగా ఇప్పుడు ఫైనల్ గా త్రివిక్రమ్ సినిమా రెండో షెడ్యూల్ డేట్ ని లాక్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి లేటెస్ట్ సమాచారంతో అయితే ఈ షూట్ ఈ జనవరి 18 నుంచి హైదరాబాద్ లో భారీ ఏక్షన్ షెడ్యూల్ తో స్టార్ట్ చేయనున్నారట.

ఇక ఈ షెడ్యూల్ లో డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కూడా జాయిన్ కానుండగా ఆల్రెడీ ఈ షూట్ పై ఆమె కూడా సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చింది.

దీనితో సినిమా షూటింగ్ కి సర్వం సిద్ధం అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా శ్రీ లీల కూడా కనిపించనుండగా

థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు మహేష్ కెరీర్ లో ఓ భారీ ఏక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.