సౌత్ సినిమా ఇండస్ట్రీ దగ్గర భారీ క్రేజ్ అండ్ తనకంటూ సెపరేట్ మార్కెట్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సమంత ప్రభు కూడా ఒకరు.
మరి సామ్ అయితే ఇప్పటివరకు తన లైఫ్ లో చాలానే కష్టాలు చూసేసింది.
అది పర్సనల్ లైఫ్ లోనే ఎక్కువ కాగా వాటిని అధిగమించి అయితే సామ్ ఇప్పుడు సినిమాలు చేస్తూ వాటితో మంచి సక్సెస్ లు కూడా స్కోర్ చేస్తుంది.
ఇక ఇదిలా ఉండగా కొన్ని నెలల కితమే తాను మాయోసైటిస్ అనే కండరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టుగా షాకింగ్ న్యూస్ ఆమె షేర్ చేయగా ఒక్కసారిగా అందరికి ఊహించనిదిగా మారింది.
ఇక ఇప్పుడు అయితే సమంత నుంచి లేటెస్ట్ గా వచ్చిన పోస్ట్ కాస్త పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం ఆసక్తిగా మారింది.
తాను ఓ ఫోటో పెట్టి అయితే ఫంక్షన్ ముందుంది.. ఈసారి అంతా కొత్తగా కొంచెం ఈజీగా ఉండబోతుంది అంటూ కొత్త సంవత్సరంలోకి పెట్టబోతుండగా ఈ గుడ్ న్యూస్ ని ఆమె షేర్ చేసింది.
దీనితో సమంతా ఎట్టకేలకి రికవర్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు వర్క్ అని టాలీవుడ్ ప్రముఖులు చెప్తున్నారు.
దీనితో అభిమానులు కూడా సామ్ కోలుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సమంత రీసెంట్ గానే “యశోద” అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టగా నెక్స్ట్ అయితే “శాకుంతలం” అనే మరో పాన్ ఇండియా సినిమాతో సిద్ధంగా ఉంది.