మన రోజువారి ఆహారంలో రుచి కోసం మెంతులను, మెంతికూరను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం.
అయితే మెంతుల్లో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక విలువలు, సహజ ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు
మెంతుల్లో ఉన్న ఫైబర్, సహజ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోవేల్ గుణాలు శరీరంలో ఉన్న వ్యాధి కారకాలను తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
తరచూ ఆహార పదార్థాలలో భాగంగా మెంతులు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు .
ముఖ్యంగా రక్తంలో గ్లూకోస్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపు చేయడంలో మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయి
అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజా అధ్యయనాల ప్రకారం షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారందరూ మెంతులను ఎక్కువగా తినడం అంత మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు.
మెంతులు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతాయన్న విషయం వాస్తవమే అయితే షుగర్ వ్యాధి వచ్చిన మొదటి 5 సంవత్సరాల లోపే మెంతులు షుగర్ వ్యాధిని నియంత్రించ గలుగుతాయి.
దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు మెంతులను తీసుకోవడం వల్ల ప్రభావం చూపదని చెబుతున్నారు.
చిన్న వయసులోనే షుగర్ వ్యాధి బారిన పడి దీని నుండి ఎటువంటి ప్రమాదం లేదు అన్న పూర్తి పరీక్షలు చేయించుకున్న వారు మాత్రమే మెంతులను వాడి షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు.
అధిక బరువు ఉన్నవారు మెంతులను తినొచ్చు.అలాగే పది సంవత్సరాల లోపు పిల్లలు, వృద్ధులు, గాయాలు ఎక్కువ రోజులు మనకపోవడం,
గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, కడుపులోపుండ్లు, అల్సర్లు ఉన్న వారు, బరువు తక్కువగా ఉన్న,గర్భవతులు, జ్వరం వచ్చిన వారు,
ధైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడుతూ షుగర్ వచ్చిన వారు అస్సలు మెంతులను ఆహారంలో తీసుకోకపోవడమే మంచిదంటున్నారు వైద్యులు.