మహేష్ సినిమాకి హ్యాండిచ్చిన ఫ్యాన్స్..?

 ఇప్పుడు టాలీవుడ్ లో ఒకదాని తర్వాత ఒక సినిమాకి పెద్ద ఎత్తున రీ రిలీజ్ లు నడుస్తున్న సంగతి తెలిసిందే.

 మరి ఈ ట్రెండ్ ని స్టార్ట్ చేసిందే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్.

 ఓ సినిమాని రీ మాస్టర్ చేసి దానిని మళ్ళీ రీ రిలీజ్ చేయడం అనేది వారి నుంచే “పోకిరి” సినిమాతో స్టార్ట్ అయ్యింది.

 ఇక ఇప్పుడు నెక్స్ట్ గ్రాండ్ రిలీజ్ గా అయితే తన హిట్ సినిమా “ఒక్కడు” చిత్రాన్ని తీసుకొచ్చారు.

 కానీ అనూహ్యంగా ఈ సినిమాకి అనుకున్న రేంజ్ రెస్పాన్స్ రాకపోవడం ఆశ్చర్యంగా మారింది.

 అయితే ఒక్కడు రిలీజ్ పవన్ ఫాన్స్ చేసుకున్న ఖుషి కి గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటే..

 పలు ఏరియాల్లో కొంత మేర మంచి బుకింగ్స్ కూడా నమోదు అయ్యాయి కానీ అనుకున్న రేంజ్ రెస్పాన్స్ అయితే సినిమాకి రాలేదు అని తెలుస్తుంది.

 సినిమా రీ రిలీజ్ ఈరోజు జనవరి 6నే కాగా అనుకున్న హంగామా కూడా ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

 దీనితో మహేష్ ఈ రీ రిలీజ్ మాత్రం తన ఫ్యాన్స్ హ్యాండివ్వడం వాళ్ళ ప్లాప్ రీ రిలీజ్ గా మారిపోయింది.

 ఖుషి సినిమాకి ఎలా లేదన్న 6 కోట్ల మేర గ్రాస్ ఇప్పటివరకు వచ్చింది. మరి ఒక్కడు దీనిని మ్యాచ్ చేస్తుందో లేదో చూడాలి.

 ఇంకా ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా భూమిక హీరోయిన్ గా నటించింది. అలాగే ఎం ఎస్ రాజు ఈ సినిమాని నిర్మాణం వహించారు.