ఓపెన్ హార్ట్ అంటాడు.! వీకెండ్ కామెంట్ అంటాడు.! కొత్త పలుకు పేరుతో.. ఏవేవో పలుకుతుంటాడు.! అసలు జర్నలిజం అంటే ఏంటి.?
ఈయనగారి నుంచి పాఠాలు నేర్చుకోవాలా కొత్త తరం జర్నలిస్టులు.? నేర్చుకుంటే, సర్వనాశనమైపోయినట్లే.! అంతే మరి.!
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ‘టీడీపీ పెంపుడు కుక్క’ అంటూ విమర్శలు రావడం కొత్తేమీ కాదు.
1 ఆ విమర్శలపై ఏబీఎన్ రాధాకృష్ణకి పెద్దగా ఇబ్బంది కూడా లేదు.! ‘నేను నిప్పు..’ అని చంద్రబాబు ఎలా అనుకుంటారో, ‘నేను నిప్పులాంటి జర్నలిస్టుని’ అని రాధాకృష్ణ కూడా అలాగే అనుకుంటారు.
వైసీపీ ప్రభుత్వం మీద విషం చిమ్మడమే ఏబీఎన్ ఆర్కే ఎజెండా.! మీడియా, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రభుత్వంలో వున్నవారిని ప్రశ్నించాలి.
కానీ, అలా ప్రశ్నించడం పేరుతో.. చెత్త జర్నలిజం చేస్తే ఎలాగన్నదే అసలు సమస్య. పవన్ కళ్యాణ్‌కి వెయ్యి కోట్ల ప్యాకేజీ ఇచ్చేందుకు కేసీయార్ వ్యూహ రచన చేస్తున్నారన్నది ఏబీఎన్ ఆర్కే జోస్యం.!
ఆయనకి ఎవరు చెప్పారో ఏమో.! మీడియా అంటే సాక్ష్యాధారాలతో వార్తలు రాయాలి. అంతేగానీ, గాలి పోగేసి రాస్తే.. అది జర్నలిజం ఎలా అవుతుంది.?
జర్నలిజం లెక్కలు మారిన మాట వాస్తవం. ఏ వార్తా లేకపోతే, వార్తల్ని వండి వడ్డించే ట్రెండ్ వచ్చిందనేదీ కాదనలేం. కానీ, మరీ ఇంతలానా.? దీన్ని జర్నలిజం అనలేం.
దీనికి వేరే ఏదో పేరు పెట్టాలి. పవన్ కళ్యాణ్ విషయంలో చేసిన వెయ్యి కోట్ల ప్యాకేజీ కామెంట్‌పై వివరణ ఇచ్చుకునే క్రమంలో ఆర్కే పడ్డ మానసిక వ్యధ అంతా ఇంతా కాదు.
ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదు. అది ఆర్కే కొత్త పలుకులోని ప్రతి అక్షరంలోనూ కనిపిస్తోంది.