శరీరం నుంచి అధిక చెమటలు వెలువడుతున్నాయా… ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు!

 సాధారణంగా మన శరీరం నుంచి చెమటలు రావడం సర్వసాధారణం మనం ఏదైనా శ్రమకు మించి పని చేసినప్పుడు లేదా అలసట ఉన్నప్పుడు

 మన శరీరం నుంచి చెమటలు రావడం సర్వసాధారణం. ఇక వేసవికాలం వచ్చిందంటే వాతావరణంలో ఉష్ణోగ్రతల కారణంగా కూడా కొన్నిసార్లు మన శరీరం నుంచి చెమట వెలబడుతుంది.

 ఇలా శ్రమ కారణంగా చమటలు రావడం సర్వసాధారణం.అయితే మనం రాత్రి నిద్రపోతున్న సమయంలోను లేక చల్లని ప్రదేశంలో ఉన్నా కూడా

 మన శరీరం నుంచి చెమటలు వెలబడుతున్నాయి అంటే తప్పనిసరిగా ఇది ఆలోచించాల్సిన విషయమేనని నిపుణులు చెబుతున్నారు.

 ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ శరీరం నుంచి చెమటలు వస్తున్నాయి అంటే తప్పనిసరిగా అది మధుమేహ వ్యాధి సమస్య అని తెలుసుకోవాలి.

 ఇలా మనం మధుమేహ వ్యాధికి గురైన సమయంలోనే ఇలా శరీరం నుంచి చెమటలు బయటకు వస్తాయి.

 డయాబెటిస్‌లో శరీరం దాని సహజ ఉష్ణోగ్రతను నిర్వహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

 దీని కారణంగా తల తిరగడం, చెమట పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో చక్కెర లెవెల్స్ బ్యాలెన్సింగ్ గా లేనప్పుడు అధిక చెమట ఏర్పడుతుంది.

 కొంతమందికి పాదాలు లేదా తొడలలో చెమట పడుతుంది.ఒక పరిశోధన ప్రకారం చాలామంది శరీరంలో చక్కర స్థాయిలు తగ్గినప్పుడే ఇలా చెమటలు పడతాయని రుజువైంది.

 ఇక చాలామంది వారికి షుగర్ వ్యాధి ఉందని ఉద్దేశంతో పూర్తిగా స్వీట్ తినడం మానేస్తారు. ఇలా ఎప్పుడైతే మనం పూర్తిస్థాయిలో చెక్కరను దూరం పెడతాము

  అదే సమయంలో మన శరీరంలో చక్కెర స్థాయిలో నియంత్రణ కోల్పోయి శరీరం నుంచి ఎక్కువగా చెమటలు వెదజల్లుతూ ఉంటాయి.