ప్రస్తుతం టాలీవుడ్ సహా పాన్ ఇండియా సినిమా దగ్గర కూడా సెన్సేషనల్ హైప్ తో ఉన్న పలు చిత్రాల్లో గ్లోబల్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న భారీ చిత్రం కూడా ఒకటి.
దర్శకుడు కొరటాల శివ చేయనున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా చేయనుండగా ఈ సినిమా అలా వాయిదా పడుతూ వస్తుంది.
తీరా సినిమా స్టార్ట్ చేసే సమయం నాటికి వారి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇక మొత్తానికి అయితే ఎన్టీఆర్ ఓ డెసిషన్ తీసుకొని
మేకర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తాజా అప్డేట్. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా కి చిత్ర యూనిట్ ఈ మార్చ్ లో పూజా కార్యక్రమాలు చేయనుండగా నెక్స్ట్ అయితే
ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏప్రిల్ నెల నుంచే షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట.
ఇక అక్కడ నుంచి అయితే ఫైనల్ గా సినిమా అనుకున్నట్టుగా టైం కి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ కాగా ఈమెపై కూడా ఓ బిగ్ అప్డేట్ రానున్నట్టుగా తెలుస్తుంది.
ఇంకా ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ అనే కొత్త బ్యానర్ వారు
ఈ సినిమాని భారీ బడ్జెట్ కేటాయించి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.