నందమూరి నటసింహం బాలకృష్ణకు ఎంతోమంది అభిమానులు ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఈయనకు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా అభిమానులుగా ఉన్నారు.
ఈ క్రమంలోనే బాలయ్య మెగా అభిమానులకు ఏమాత్రం పడదని వీరిద్దరి మధ్య పెద్ద పోటీ ఉంటుందని సంగతి మనకు తెలిసిందే.
ఇలా అభిమానుల మధ్య పోటీ ఉన్నప్పటికీ హీరోల మధ్య మాత్రం ఎలాంటి పోటీ లేదని హీరోలు మాత్రం చాలా స్నేహపూర్వకంగా ఉంటారని ఇప్పటికే నందమూరి మెగా హీరోలు చాటి చెప్పారు.
ఇకపోతే మెగా కాంపౌండ్ లో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి ధరం తేజ్ కూడా ఇలాంటి కోవకే చెందుతారు.
ఈయన మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అయినప్పటికీ ఈయన మాత్రం బాలయ్యకు పెద్ద అభిమాని.
ఇక బాలయ్య సినిమాలు విడుదలవుతున్నాయి అంటే తప్పనిసరిగా విడుదలకు ముందే సాయి ధరమ్ తేజ్ సినిమా సక్సెస్ కావాలని విష్ చేస్తూ ఉంటారు.
అఖండ సినిమా విడుదలకు ముందు సాయిధరమ్ తేజ్ ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకోగా ఈయనకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నందమూరి అభిమానులు తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఇక తాజాగా బాలకృష్ణ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అలాగే చిరంజీవి సినిమా రేపు విడుదల కానుంది.
ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరంతేజ్ మాత్రం బాలకృష్ణ సినిమా సక్సెస్ కావాలని కోరుకోవడంతో నందమూరి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా
మెగా ఫాన్స్ మాత్రం షాక్ అవుతున్నారు.రేపు తన మామయ్య సినిమా విడుదల కాబోతుండగా బాలకృష్ణ సినిమాకు విష్ చేయడంతో ఈయన బాలయ్యకు ఎంత అభిమానినో అర్థమవుతుంది.