మనలో చాలామందికి టీ కాంబినేషన్లో రస్క్ ను తినడం అలవాటే ఉంటుంది. కొందరైతే టీ లో స్నాక్స్ గా రస్క్ లేకపోతే టీ తాగడానికి కూడా ఇష్టపడరు.
టీ తాగిన తాగినట్టు కూడా ఉండదని చెబుతుంటారు. అయితే తాజా అధ్యయనాల ప్రకారం వెలువడిన వాస్తవాలను మీరు తెలుసుకుంటే రస్క్ ను తినే విషయంలో మీ అభిప్రాయాలను కచ్చితంగా మార్చుకుంటారని చెప్పొచ్చు.
వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం రస్క్ ఎక్కువగా తినేవారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువట. దానికి గల కారణాలను ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా రస్క్ తయారు చేయడానికి బొంబాయి రవ్వ ను ఎక్కువగా ఉపయోగించాలి.
కానీ కొందరు బ్రేకరీ నిర్వాహకులు తమ లాభాల కోసం చీప్ గా దొరికే మైదాపిండిని ఎక్కువగా వాడి బొంబాయి రవ్వను తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు.
అలాగే రస్క్ ను చూడగానే తినాలనిపించేలా చేయడానికి క్యారమెల్ రంగును లేదా బ్రౌన్ఫుడ్ కలర్ ను ఎక్కువగా వాడుతారు.
ఫలితంగా మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపి జీర్ణ సమస్యలు, డయాబెటిస్, ఉబకాయం వంటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.
కొందరు బ్రేకరి నిర్వాహకులు అయితే దారుణంగా బేకరీల్లో ఎండిపోయిన బ్రెడ్ ముక్కలతోనూ రస్క్లు తయారు చేస్తుంటారని ఇటీవల సోదాల్లో బయటపడింది.
ఎండిపోయిన బ్రెడ్ పై ప్రమాదకర బూజు, ఫంగస్ వంటివి ఉత్పత్తి అవుతాయి. దానికి తోడు రస్క్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి కెమికల్స్ ను కూడా కలుపుతారు.
మనకు తెలియకుండా దానిని ఆహారంగా తీసుకుంటే అతిసారం, వాంతులు,ఫఫుడ్ పాయిజనింగ్, మలబద్ధకం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
రస్కుల్లో వాడే కల్తీ నెయ్యి లేదా పామ్ ఆయిల్ వల్ల గుండె ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ కల్తీ ఆయిల్ లో ఉండే ప్రమాదకర కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో రక్త సరఫరాకు అడ్డుపడి రక్త పోటు, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు రస్కును ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి నియంత్రణ కోల్పోతుందని నిపుణులు చెబుతున్నారు కారణం ఇందులో ఎక్కువగా రిఫైన్డ్ షుగర్ ను వినియోగించడమే.
ఒకవేళ మీకు రస్కు తినాలనిపిస్తే నాణ్యమైన గోధుమ లేదా బొంబాయి రవ్వతో తయారు చేసిన రస్క్ను మాత్రమే తినడానికి ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.