ప్రతిరోజు ఉదయాన్నే నీటి నిల్వలు అధికంగా ఉండి కొలెస్ట్రాల్ పరిమాణం అత్యల్పంగా ఉండే సొరకాయను జ్యూస్ రూపంలో తీసుకుంటే శరీర జీవక్రియలకు అవసరమైన అన్ని విటమిన్స్ ,
మినరల్స్,కార్బోహైడ్రేట్స్,ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా వేసవి సీజన్ ప్రారంభమవుతుండడంతో శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోవడానికి సోర జ్యూస్ ను ప్రత్యామ్నాయంగా ఎన్నుకోవచ్చు.
ప్రతిరోజు ఉదయాన్నే సొర కాయను జ్యూస్ రూపంలో తీసుకుంటే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సహాయపడి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.
ఉదయాన్నే సొరకాయ జ్యూస్ సేవిస్తే మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది.
మన శరీరానికి తగిన నీటి శాతాన్ని అందించి డిహైడ్రేషన్ సమస్యను తొలగించి రోజంతా చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది.
అత్యల్ప క్యాలరీలు, కొవ్వు కలిగిన సొరకాయ జ్యూస్ ను సేవిస్తే ఉబకాయం, అధిక కొలెస్ట్రాల్ సమస్య తొలగిపోయి శరీరం నాజూగా తయారవుతుంది.
మరియు గుండె, మెదడు, కిడ్నీ పనితీరు మెరుగుపరచడంలోసహాయపడతాయి.సొరకాయలోయాంటీక్యాన్సర్గుణాలు,
ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండడం వల్ల ఉదయాన్నే సొరకాయ జ్యూస్ సేవిస్తే మన శరీరంలోని క్యాన్సర్ కణాలను నశింపజేసి అనేక క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తుంది
అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు సొరకాయ జ్యూస్ ను సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న
పొటాషియం,మెగ్నీషియం, జింక్, ఐరన్ రక్తప్రసరణ వేగాన్ని తగ్గించి రక్తపోటు గుండెపోటు ప్రమాదం నుంచి మనల్ని కాపాడతాయి.
రక్తహీనత సమస్య తొలగిపోయి నీరసం అలసట వంటి లక్షణాల నుంచి విముక్తి కలుగుతుంది.
యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారు తరచూ సొరకాయ జ్యూస్ సేవిస్తే కిడ్నీలో ఉండే స్టోన్స్
మూత్రం ద్వారా బయటికి పంపడమే కాకుండా కిడ్నీ ఇన్ఫెక్షన్లు తగ్గించి కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది.