వంటింట్లో వాడే ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి దుర్వాసన వస్తోందా…చక్కటి పరిష్కార మార్గాలు మీకోసమే!

 మన రోజువారి కార్యకలాపాల్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకం రోజురోజుకు పెరుగుతోంది.

 ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని ఎంత తగ్గించుకోవాలన్నా ఏదో రకంగా నిత్యo ప్లాస్టిక్ వస్తువులను వాడడం తప్పనిసరిగా మారింది.

 ముఖ్యంగా వంటింట్లో ఆహార పదార్థాలను, పచ్చళ్లను నిల్వ చేసుకోవడానికి మరియు ఫ్రిజ్లో పాలు నీళ్లను స్టోర్ చేసుకోవడానికి అత్యధికంగా ప్లాస్టిక్ వస్తువులను వినియోగిస్తుంటారు.

 ప్లాస్టిక్ వస్తువులను వినియోగించిన తర్వాత ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్లు వృద్ధి చెందడంతో పాటు దుర్వాసన వచ్చి మనల్ని అసౌకర్యానికి గురిచేస్తుంది.

 ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేయడంలో కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

 వంటింట్లో ఉపయోగించే కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఎంత శుభ్రం చేసిన మరకలు వదలకపోగా దుర్వాసన వస్తుంటాయి

 అలాంటప్పుడు గోరువెచ్చని నీళ్లలో వెనిగర్ వేసి ఆ నీళ్లతో డబ్బాలను నింపి 5 లేదా 6 గంటలసేపు అలాగే ఉంచి

 తర్వాత సబ్బు నీళ్లతో ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేసుకుంటే మరకలు తొలగిపోవడమే కాకుండా దుర్వాసనను అరికట్టవచ్చు.

 నిమ్మరసంలోని సిట్రికామ్లం పాత్రలకు అంటుకున్న పదార్థాల వాసనను తొలగించడంలో సమర్థంగా పనిచేస్తుంది.

  ఇందుకోసం నిమ్మకాయను కట్ చేసి ప్లాస్టిక్ వస్తువులపై గట్టిగా రుద్ది తర్వాత సబ్బు నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

 ప్రతిరోజు ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు తెచ్చుకోవడం మనందరికీ అలవాటే.

 అయితే ఈ బాటిల్స్ ను ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నప్పటికీ జిడ్డు మరక మరియు వాసన తొలగిపోదు.

 అలాంటప్పుడు ఆ బాటిల్‌లో కొద్దిగా ఉప్పు వేసి ఒక రోజంతా పక్కన పెట్టేయాలి మరుసటి రోజు సబ్బు నీళ్లతో శుభ్రం చేస్తే సరిపోతుంది.

 ప్లాస్టిక్ డబ్బాల్లో చెడు వాసనను తొలగించుకోవడానికి ఒక న్యూస్‌పేపర్‌ని మడిచి వాసన వచ్చే ప్లాస్టిక్‌ డబ్బాలో చొప్పించి మూత పెట్టేయాలి.

 ఇలా దీన్ని ఒకట్రెండు రోజులు పక్కన పెట్టేయాలి. ఈ చిట్కా వల్ల కూడా ప్లాస్టిక్‌ డబ్బాల్లోని దుర్వాసనలు దూరమవుతాయట.