ఎన్టీఆర్ కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా.. విషయం తెలిసి షాక్ అయిన ప్రణతి!

 సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. అయితే వారు కూడా ఇతర సెలబ్రిటీలకు అభిమానులు గానే ఉంటారని చెప్పాలి.

 ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

 ఎన్టీఆర్ అంటే స్టార్ హీరో హీరోయిన్లు సైతం అభిమానించే అంత క్రేజ్ ఈయన సొంతం చేసుకున్నారు.

 ఇలా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్ కూడా ఒక హీరోయిన్ అంటే ఎంతో ఇష్టపడతారని ఆ హీరోయిన్ కి తాను అభిమాని అని తెలియజేశారు.

 ఎన్టీఆర్ గారికి ఇండస్ట్రీలో మహానటి సావిత్రి అంటే చాలా ఇష్టమని పలు సందర్భాలలో వెల్లడించారు.

 అయితే సావిత్రి గారి తర్వాత అంతగా ఇష్టపడే హీరోయిన్ ఎవరు అంటే నిత్యామీనన్ అని టక్కున నిత్యామీనన్ అని సమాధానం చెబుతారు.

 నిత్యామీనన్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి జనతా గ్యారేజ్ సినిమాలో నటించారు. అయితే ఈమె సహజ నటనకు ఎన్టీఆర్ తనకు అభిమానిగా మారిపోయారట.

 ఇక ఇదే విషయాన్ని తన భార్య లక్ష్మీ ప్రణతి దగ్గర చెప్పడంతో ఆమె కూడా షాక్ అయ్యారట.ఎన్టీఆర్ నిత్యామీనన్ కలిసి కేవలం ఒకే సినిమాలో నటించారు.

 ఈ సినిమాలో కూడా ఈ ఇద్దరి జంటకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో తనతో మంచి బాండింగ్ ఏర్పడిందని అంతేకాకుండా నటనలో నిత్యామీనన్ సహజత్వం చూసినటువంటి ఎన్టీఆర్ ఆమెకు అభిమానిగా మారిపోయానని తెలిపారు.

 అదేవిధంగా తనతో కలిసినటించే అవకాశం వస్తే ఏ మాత్రం ఛాన్స్ వదులుకోనని ఎన్టీఆర్ గతంలో చేసినటువంటి కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.