మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో, గుడిలో లేదా ఏదైనా శుభకార్యాలలో పూజ చేసేటప్పుడు కలశం పెట్టి దానిమీద కొబ్బరికాయ ఉంచి పూజిస్తారు.
అయితే కలిసం మీద ఇలా కొబ్బరికాయ ఎందుకు పెట్టి పూజిస్తారో ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు.
కలశాన్ని పెట్టేటప్పుడు దానిని బాగా శుభ్రం చేసి గంగాజలంతో నింపి పసుపు కుంకుమ తో బోట్లు పెట్టీ కలశంలో 5 తమలపాకులు ఉంచి ఆ తర్వాత కొబ్బరికాయ పెడతారు.
అయితే ఇలా పూజ సమయంలో కలశం మీద కొబ్బరికాయ ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఇంట్లో శుక్రవారం రోజున కలశం పెట్టి పూజ చేస్తారు. అంతేకాకుండా ప్రత్యేక పూజలు, వ్రతాలు, నోములు చేసేటప్పుడు కలశం పెట్టడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని ప్రజల నమ్మకం.
అయితే కలశంపై కొబ్బరి కాయను పెట్టడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది. ఈ విశ్వం మొత్తానికి కొబ్బరికాయ మరో రూపంగా భావిస్తారు.
సకల దేవతలు ఉన్న ఈ విశ్వానికి మరో రూపం అయిన కొబ్బరికాయ ఆ దేవుళ్ళ అంశం కలిగి ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.
అందువల్ల శుభకార్యాలు, పూజా సమయాలలో కలశంపై కొబ్బరికాయలను ప్రతిష్టించి పూజిస్తారు.
అయితే పూజ ముగిసిన తర్వాత కలశం మీద ఉంచిన ఈ కొబ్బరికాయను ఏం చేయాలని చాలామందికి అనుమానం ఉంటుంది.
ఇలా కలశం మీద ప్రతిష్టించిన కొబ్బరికాయను పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణుడికి ఇచ్చి పాదాభివందనం చేయటం వల్ల పూజ ఫలితం లభించడమే కాకుండా ఆ బ్రాహ్మణుడి ఆశీర్వాదంతో సర్వసుభాలు కలుగుతాయి.
ఒకవేళ ప్రతివారం ఇంట్లో కలశం పెట్టుకునేవారు ఆ కొబ్బరికాయను బ్రాహ్మణుడికి ఇవ్వటానికి వీలు లేని సందర్భంలో దానిని పారుతున్న కాలువలో వదిలేయాలి.
అంతేకాకుండా ఇలా నదీ కాలువలు సమీపంలో లేనివారు కలశం మీద ఉంచిన కొబ్బరికాయను ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుడి ముందు కొట్టవచ్చు.
అయితే కలశం మీద ఉంచిన కొబ్బరికాయను పొరపాటున కూడా ఎక్కడపడితే అక్కడ పడేయరాదు.