ఒక కుటుంబం ఆర్థికంగా మెరుగుపడి పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే ఆ ఇంట్లో స్త్రీలు గుణవంతురాలై ఉండాలని చాణిక్య నీతి చెబుతోంది.
ఇంట్లో మీ ఇల్లాలు సాంప్రదాయాన్ని గౌరవించే గుణవంతురాలు అయితే ఆ ఇల్లు సుఖసంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ప్రకాశిస్తుంది.
అదే ఆ ఇంట్లో ఇల్లాలు పెద్దలంటే గౌరవం లేక సాంప్రదాయాన్ని గౌరవించకుండా చీటికిమాటికి అరుస్తూ గొడవ పడుతూ ఉంటే ఆ ఇల్లు నరకప్రాయం అవుతుందని చెప్పడం జరిగింది.
ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ కచ్చితంగా ఉంటుందని మన పెద్దవారు చెబుతుంటారు. అలాగే ఒక పురుషుని పతనం వెనుక ఇప్పుడు చెప్పబోయే లక్షణాలున్న స్త్రీలు కూడా కచ్చితంగా ఉంటారని చెప్పొచ్చు.
ముఖ్యంగా నోట్లో మాట దాగని స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పే స్త్రీల వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి ఒక్కొక్కసారి ప్రాణాలకే హాని కలగవచ్చు.
వీరి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి అవసరమైనంత మేరకు ప్రాముఖ్యత ఇచ్చి కొన్ని విషయాలను మాత్రమే వీరితో ప్రస్తావించాలి. ముఖ్యమైన విషయాలు వీరుతో చర్చిస్తే మీ పతనం కాయం.
మీ జీవితంలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే స్త్రీ ఉంటే మీరు ఆర్థికంగా ప్రగతి సాధించలేరు. దుబారా ఖర్చులు వస్తే మీ అవసరాలకు డబ్బు లేక చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎంత సంపాదించిన మీకు తోడుగా ఉండేది మీరు పొదుపు చేసిన సొమ్ము మాత్రమే అనేది గ్రహించాలి. అవసరమైన చోట ఖర్చు పెట్టాలి అనవసరమైన చోట ఖర్చు పెట్టడం తగ్గించాలి.
ఇక అలాగే చీటికిమాటికి గొడవ పెట్టుకుని కోపం తెచ్చుకునే మహిళను అసలు నమ్మకూడదు. ఇలాంటి వారి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్షణికావేశంలో ఎలాంటి పనికైనా వెనకాడరు.
తన కోపమే తనకు శత్రువు ఈ వాక్యం మగవారి కైనా ఆడవారికైనా ఒకేలా వర్తిస్తుంది. ఎలాంటి బాధలు ఎదురైనా సర్దుకొని పోయే స్త్రీ మీ జీవితంలో ఉంటే మీ దాంపత్య జీవనానికి మీ ఆర్థిక ప్రగతికి ఎలాంటి ఆటంకాలు కలగవు.