పెళ్లయిన తర్వాత భార్య భర్తల బంధం మరింత బలపడాలి అంటే ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఉండాలి
అయితే చాలా మంది అబ్బాయిలు మాత్రం పెళ్లి తర్వాత తమ జీవితం మొత్తం తమ భార్య కంట్రోల్ లోకి వెళ్లిపోయిందని తెగ ఫీల్ అవుతూ ఉంటారు.
భార్యకు ఏం కొనిపెట్టిన చాలా అసంతృప్తిగానే ఉంటారని తనకు ఏం కావాలో మాకు తెలియడం లేదు అంటూ సమాధానాలు చెబుతుంటారు
అయితే ఒక భార్య భర్త నుంచి ఎప్పుడూ కూడా ఏం ఆశిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా ఒక భార్య భర్త నుంచి ఎప్పుడూ కూడా శ్రద్ధ కోరుకుంటుంది. తన భర్త తన పట్ల కాస్త శ్రద్ధ చూపించాలి అని ఆశపడుతుంది.
ఆమె పట్ల మీరు ప్రేమ ఆప్యాయత చూపించాలని కోరుకుంటుంది మీరు గోరంత ప్రేమ చూపిస్తే ఆమె మీకు తిరిగి కొండంత ప్రేమను పంచుతుంది.
ఇక భార్యాభర్తల విషయంలోనే కాదు ఏ సంబంధంలోనైనా కమ్యూనికేషన్ అనేది ఎంతో ముఖ్యం మీరు ఏదైనా మాట్లాడాలనుకున్న తప్పనిసరిగా
మీ భార్యతో ఆ విషయం గురించి మాట్లాడాలి అదేవిధంగా ఆమె చెప్పేది కూడా అంతే సహనంతో వినాలి ఇలా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది తప్పనిసరి.
ఇక మీ భార్య ఎప్పుడూ కూడా మీ నుంచి మద్దతు కోరుకుంటుంది. పలు విషయాలలో మీరు తనకు మద్దతుగా నిలబడాలని ఆశపడుతుంది.
ఇలా అవసరమైనప్పుడు మీరు ఆమెకు కాస్త ప్రోత్సాహాన్ని మద్దతును తెలియజేయడం అవసరం.
ఇక నమ్మకం కూడా భార్య భర్తల మధ్య ఎంతో అవసరం మీ భార్య మీ నుంచి ఎప్పుడు కూడా ఇదే నమ్మకాన్ని కోరుకుంటుంది.
ఇలా భార్యాభర్తలు ఇద్దరు కూడా నమ్మకంగా ఉండడం వల్ల ఆ బలం మరింత బలపడుతుంది.
అదేవిధంగా భార్య ఎప్పుడూ మీ నుంచి గౌరవాన్ని ఆశిస్తుంది నలుగురిలో ఉన్నప్పుడు మీరు తన పట్ల హేళనగా మాట్లాడకుండా కాస్త గౌరవంగా మాట్లాడాలని కోరుకుంటుంది.