సాధారణంగా ప్రతి ఇంట్లో ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. దేవుడి మందిరంలో కలశం పెట్టి పూజలు చేస్తూ ఉంటారు.
కలశం లక్ష్మీ అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. అందువల్ల ప్రతి ఇంట్లో తప్పనిసరిగా కలశాన్ని పూజిస్తూ ఉంటారు. సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ.. ప్రపంచాన్ని సృష్టించాడు.
ప్రపంచాన్ని సృష్టించటానికి బ్రహ్మ తొలుత కలశస్థాపన చేసి అందులో నీరు పోశాడని..అదే సృష్టి ఆవిర్భావానికి ప్రతీకగా నిలిచిందని చెబుతారు.
ఇక కలశంలో ఉంచిన ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక. దానికి చుట్టే దారం..సృష్టిలో అన్నింటినీ బంధించే ‘ప్రేమ’ను సూచిస్తుంది. అందుకే కలశాన్ని పూజించటం శుభసూచనగా పరిగణిస్తారు.
అయితే పూజలో కలశంపై ఉంచిన కొబ్బరికాయ పూజ పూర్తయిన తర్వాత ఏం చేయాలి అని చాలామందికి సందేహం ఉంటుంది. ఇలా కలశం మీద పెట్టిన కొబ్బరికాయ కొంతమంది గంగాజలంలో వదిలేస్తే మరి కొంతమంది ఇంట్లో వాడుకుంటారు.
అయితే కలశం మీద ఉంచిన కొబ్బరికాయలు ఇంట్లో ఉపయోగించడం వల్ల అశుభమని చాలామంది చెబుతూ ఉంటారు. అసలు కలశం మీద ఉంచిన కొబ్బరికాయను పూజ తర్వాత ఏం చేయాలో అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కలశం మీద ఉంచిన కొబ్బరికాయను పూజ తరువాత పూజ చేయడానికి వచ్చిన పండితులకు ఇస్తే దానిని పూర్ణఫల దానం అని అంటారు. ఇలా కొబ్బరికాయలో పండితులకు దానం చేయడం వల్ల శుభం జరుగుతుంది.
అలాగే ప్రతివారం కలశం మీద ఉంచిన కొబ్బరికాయ దానం చేయటానికి వీలు లేనప్పుడు దానిని మనం ఇంట్లో ఉపయోగించుకోవచ్చు.
కొబ్బరికాయ ఇంట్లో ఉపయోగించడం వల్ల ఆశుభం జరుగుతుందని భయపడాల్సిన పనిలేదని పండితులు చెబుతున్నారు.అంతేకాకుండా ఇలా కలిసే మీద పెట్టిన కొబ్బరికాయలు గంగాజలం లో కూడా వదిలేయవచ్చు.
ఒకవేళ కలశం మీద ఉంచిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభం జరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.
కొబ్బరికాయ కుళ్ళిపోతే కలశం లో ఉన్న నీటితో దేవుడి మందిరాన్ని, మిమ్మల్ని ప్రక్షాళన చేసుకుని మరొక కొబ్బరికాయ కొడితే సరిపోతుంది.