సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో సంతోషంగా ఉండాలని పెళ్లి చేసుకుంటారు.
అయితే కొంతమంది దంపతులు వారి వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా గడుపుతూ ఉండగా
మరికొందరు మాత్రం లేనిపోని గొడవలు వల్ల తమ బంధాన్ని మధ్యలోనే వదులుకుంటారు. ఇలా జీవితాంతం సంతోషంగా దంపతులు కలిసి ఉండడానికి గల సీక్రెట్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా భార్యాభర్తలు అన్న తర్వాత వారి మధ్య గొడవలు రావడం సర్వసాధారణం.
అయితే గొడవలు వచ్చిన ప్రతిసారి ఏ విషయానికైతే వాళ్ళు గొడవ పడుతున్నారో అదే విషయంపై మాత్రమే ఫోకస్ పెడతారు తప్ప పాత విషయాలన్నింటినీ తవ్వి గొడవపడరు.
ఇలా ఆ విషయం గురించి గొడవపడి అనంతరం రాజీ పడుతూ ఉంటారు.
ఇక ఏ భర్త అయినా లేదా భార్య అయినా తన జీవిత భాగస్వామి వృత్తిపరమైన, వ్యక్తిగతమైన విషయాలలో వారిని ప్రోత్సహించినప్పుడే వారు జీవితాంతం సంతోషంగా ఉంటారు.
ఇక ఎవరైతే వారి జీవిత భాగస్వామి విషయంలో ఫ్లెక్సిబుల్ గా ఉండి వారికి పూర్తి మద్దతు సహకారాన్ని అందిస్తారో అలాంటివారు జీవితకాలం ఎంతో సంతోషంగా గడుపుతారు.
ఇక చాలామంది దంపతులు వారి జీవిత భాగస్వామి పట్ల ప్రేమను కలిగి ఉంటారు. కానీ ఆ ప్రేమను బయటకు తెలియజేసినప్పుడే వారు సంతోషంగా ఉండగలరు.
ఇక చాలామంది వారి జీవిత భాగస్వామి చేసే పనికి లెక్కలు వేస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడైతే లెక్కలు వేస్తామో అప్పుడు వారి మధ్య తప్పనిసరిగా గొడవలు తలెత్తుతాయి.
ఇక ఎవరైతే వారి జీవిత భాగస్వామి కోసం చిన్న చిన్న త్యాగాలు చేస్తారో అలాంటివారు కూడా జీవితాంతం ఎంతో సంతోషంగా ఉంటారు.