పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమా పవన్ కెరియర్ లోనే ఓ మైలురాయిగా చెప్పొచ్చు.
ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో రికార్డులను బద్దలు కొట్టి అత్యధిక కలెక్షన్లను రాబడుతూ ఏడాది పాటు థియేటర్లలో సందడి చేసిందటే మామూలు విషయం కాదు.
తొలిప్రేమ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన కీర్తి రెడ్డి పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా నటించి మొదటి సినిమాతోనే అద్భుత విజయాన్ని అందుకోవడంతోపాటు తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాన్ని సొంతం చేసుకుంది.
తొలిప్రేమ సినిమాకు ఇప్పటికీ యువతరంలో మంచి క్రేజ్ ఉంది. ఎం కరుణాకరుణ్ తొలిప్రేమ సినిమాతో ఇండస్ట్రీకి నూతన దర్శకులుగా పరిచయం అయ్యి స్టార్ డైరెక్టర్ గా కొనసాగారు.
హీరోయిన్ కీర్తి రెడ్డి తొలిప్రేమ సినిమాలో అద్భుతంగా నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకోవడంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందని అందరూ భావించారు
అయితే అందుకు భిన్నంగా కీర్తి రెడ్డి హీరోయిన్ ఇండస్ట్రీలో రాణించలేకపోయింది.
అందుకు ప్రధాన కారణం కీర్తి రెడ్డి అందరి కమర్షియల్ హీరోయిన్స్ మాదిరిగ గ్లామర్ పాత్రలు, ఎక్స్‌ఫోజింగ్ రోల్స్ చేయడానికి ఒప్పుకోకపోవడమే అని ఇండస్ట్రీలో చెబుతుంటారు.
కీర్తి రెడ్డి హీరోయిన్గా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న సమయంలోనే అక్కినేని హీరో సుమంత్ ను పెళ్లి చేసుకోవడం పెళ్లయిన ఏడాదికి కొన్ని కారణాలతో విడాకులు తీసుకోవడం వంటి కారణాలతో ఈమె సినిమా కెరియర్ మొత్తం నాశనమైందని చెప్పొచ్చు.
సుమంత్‌ను కీర్తిరెడ్డి పెళ్లి చేసుకుని ఉండకపోతే కొంతకాలం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కచ్చితంగా కొనసాగేది.
తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన అర్జున్ సినిమాలో మహేష్ బాబుకు సోదర నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదని చెప్పొచ్చు.
దాంతో కీర్తి రెడ్డి సినిమాల మీద ఆశ వదులుకొనీ ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది.
అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె వెండితెర పైన మరియు సోషల్ మీడియాలో దాదాపుగా ఎక్కడ కనిపించలేదని చెప్పొచ్చు.