మోహిని మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో తెలుసా?

  సాధారణంగా మనం వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడానికి ఆసక్తి చూపుతుంటామో అయితే కొన్ని మొక్కలు వాస్తు శాస్త్రం ప్రకారం

  ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల ప్రతికూల ప్రభావం మనపై పడుతుందని భావిస్తుంటారు ఇలా ప్రతికూల ప్రభావాన్ని చూపే మొక్కలను పొరపాటున కూడా

 ఇంటి ఆవరణంలోనూ పరిసర ప్రాంతాలలోనూ పెంచకూడదని పండితులు చెబుతున్నారు అయితే మన ఇంటి పరిసర ప్రాంతాలలో తమలపాకు

 మనీ ప్లాంట్ తులసి మొక్కను పెంచుకోవడం మనం చూస్తుంటాము ఈ మొక్కలను ఆధ్యాత్మికంగా కూడా భావిస్తూ ఉంటారు.

 ఇకపోతే మన ఇంటి ఆవరణంలో మోహిని మొక్కను పెంచుకోవడం వల్ల ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు

 అయితే ఈ మొక్క ఎండ అవసరం నీడ అవసరం అనేది లేదు ఎక్కడైనా కూడా ఈ మొక్క చాలా అద్భుతంగా పెరుగుతుంది.ఇకపోతే ఈ మొక్కకు ఇతర మొక్కలు మాదిరిగా ఎక్కువ నీళ్లు కూడా అవసరం ఉండదు.

 ముఖ్యంగా ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో వేడిని తగ్గించే చల్లదనాన్ని అందిస్తుంది.

 ఇకపోతే మన ఇంట్లో గోడలపై పెరిగే బ్యాక్టీరియా వైరస్ వంటి వాటిని ఈ మోహిని మొక్క పూర్తిగా ఆకర్షిస్తుంది.ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఆ ఇంటి పై ఎలాంటి నెగటివ్ ఎనర్జీ లేకుండా

 పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ మొక్కను ఇంట్లో పెట్టుకునే వారు ఆగ్నేయ దిశలో లేదా తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి.

 ఇక ఈ మొక్క ఇంట్లో లేదా మనం వ్యాపారం చేసే చోట ఆఫీసులలో ఉండటం వల్ల కూడా శుభం కలుగుతుంది వ్యాపారం చేసే చోట

 ఈ మొక్క పెట్టుకోవడం వల్ల వ్యాపారం దినదినాభివృద్ధి జరుగుతూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది.