అలర్జీలను, గాయాల ప్రభావాన్ని తగ్గించడంలో ఈ పండ్ల రసం మేలు ఎంతో తెలుసా?

 విటమిన్ సి సమృద్ధిగా లభించే పైనాపిల్ పండ్లను కచ్చితంగా శీతాకాలం సీజన్లో తినాలని న్యూట్రిషన్ నిపుణులు చెబుతుంటారు దానికి కారణం లేకపోలేదు

 సాధారణంగా చలికాలంలో జీవక్రియ రేటు కొంత మందగించి మనలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండి సీజనల్ ఇన్ఫెక్షన్లు, చర్మ, కంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతుంటాయి.

 ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం ఒక్కటే మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం. మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి తక్షణ శక్తిని ఇవ్వడంలో పైనాపిల్ కీలక పాత్ర పోషిస్తుంది

 కావున సీజనల్ గా లభించే పైనాపిల్ పండ్లను ఇష్టం లేకపోయినా కచ్చితంగా తినాలని చెబుతుంటారు. పైనాపిల్ లో అత్యధికంగా విటమిన్స్ ,కార్బోహైడ్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్స్,

  యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, మాంగనీస్, కాపర్ వంటి సహజ మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.

 సాధారణంగా అధిక ఒత్తిడి, శారీరక శ్రమ వారు, వ్యాయామం ఎక్కువగా చేసేవారు తొందరగా ఒంట్లో నీటి శాతాన్ని, లవణాలను కోల్పోయి నీరసం ,అలసట వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.

 ఇలాంటివారు తక్షణ శక్తి కోసం పైనాపిల్ లేదా పైనాపిల్ జ్యూస్ ను సేవిస్తే డిహైడ్రేషన్ సమస్య నుంచి రక్షణ పొందవచ్చు.పైనాపిల్ రసంలో అత్యధికంగా పొటాషియం అత్యల్పంగా సోడియం ఉంటుంది.

 పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి బిపి సమస్యలు తగ్గిస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

 శరీరంపై గాయాలు, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, అల్సర్లను తగ్గించడంలో పైనాపిల్ పండ్లలోని బ్రోమలైన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి.

 ప్రతిరోజు పైనాపిల్ రసాన్ని సేవిస్తే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి, విటమిన్ ఏ చర్మంపై వచ్చే ముడతలను తగ్గించి చర్మం సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.

 అలాగే దంతాలను చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచి నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడవచ్చు.

 పైనాపిల్ లో మాంగనీస్ మూలకం ఎక్కువగా లభ్యమవుతుంది కావున మందగించిన జీవక్రియలను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.