సాధారణంగా అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు తమలోని భావాలను ఇతరులతో పంచుకోకుండా మనసులోనే దాచుకుంటారు.
ఇలా తమ భావాలను ఆలోచనలను మనసులోనే దాచుకొని అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇలా ఇతరులతో తమ భావాలు పంచుకోవడానికి ఇష్టపడని అమ్మాయిలు
కొన్ని విషయాలు వినటానికి మాత్రం చాలా ఆసక్తి చూపుతారు. ఇలా అమ్మాయిలు ఆసక్తిగా వినే ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• సాధారణంగా ఒక్కొక్కరు ఒక్కో విధమైన స్వభావం కలిగి ఉంటారు. ఎవరిని ఇతరులతో పోల్చి చూడకూడదు. ముఖ్యంగా అమ్మాయిలను ఇతరులతో అస్సలు పోల్చకూడదు.
ఎందుకంటే అమ్మాయిలకు అసూయ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తమ వ్యక్తిత్వాన్ని ఇతరులతో పోల్చి తక్కువ చేసి మాట్లాడటం వల్ల వారి ఆగ్రహానికి గురికాక తప్పదు.
వారి తెలివితేటలు అందం గురించి వారిని పొగుడుతూ ఉంటే అలాంటి పొగడ్తలను వినటానికి వారు ఎక్కువ ఆసక్తి చూపుతారు.
• అలాగే మహిళల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అమ్మాయిలందరితోనూ ఇలా వారికి గౌరవం ఇస్తూ మర్యాదపూర్వకంగా నడుచుకోవడం వారికి చాలా ఇష్టం.
• సాధారణంగా అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే సంతోషపడుతూ ఉంటారు. అందువల్ల వారికి నచ్చిన చిన్న చిన్న వాటిని బహుమతిగా ఇవ్వటం వల్ల వారు ఎంతో ఆనందపడతారు.
• ముఖ్యంగా అమ్మాయిలు ఎదుటివారిని అంతా సులువుగా నమ్మరు. అమ్మాయిలకు భరోసా కల్పించేలా ప్రవర్తించటం వల్ల అమ్మాయిలు ఇతరులను నమ్ముతారు.