దంత సమస్యలకు పరిష్కారం చూపే పేస్టును ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

 ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పంటికి సంబంధించిన సమస్యలతో బాధపడడం సర్వసాధారణంగా మారుతోంది. చిన్న వయస్సులోనే దంతాలు గార పట్టి పసుపు రంగులోకి మారడం,

 దంత క్షయం, చిగుళ్ల సమస్యలు తలెత్తడానికి గల కారణాలను పరిశీలిస్తే వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, క్రమ పద్ధతి లేని ఆహారపులవాట్లు, ఫ్లోరైడ్ నీళ్లను తాగడం వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు.

 మరికొందరిలో డయాబెటిస్, క్యాల్షియం లోపం వంటి కారణాలతో కూడా పంటికి సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి.

 ఈ రోజుల్లో చాలామంది అధిక పని ఒత్తిడి కారణంగా మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.ముఖ్యంగా దంతాలను ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి.

 లేకపోతే మనం తిన్న ఆహారం పంటి సందుల్లో ఉండిపోయి ప్రమాదకర బ్యాక్టీరియా వైరస్లకు ఆవాసంగా మారుతుంది ఫలితంగా దంతాల పట్టుత్వం తగ్గి పచ్చగా మారడం,

 చిగుళ్లలో రక్తం కారడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు తలెత్తుతాయి. మీ దంతాల్లో పట్టుతం తగ్గి సహజ తెలుగు రంగును కోల్పోయినట్లు అనిపిస్తుంటే

 ఇప్పుడు చెప్పబోయే ఆయుర్వేద చిట్కాతో మీ ఇంట్లోనే సహజ పద్ధతిలో దంతాలను శుభ్రం చేసే పేస్టును తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

 ఆవనూనెను తీసుకొని అందులో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి.

 ఇంట్లో తయారు చేసుకున్న సహజ పేస్టుతో తరచూ పళ్ళను శుభ్రం చేసుకుంటే పసుపు, ఆవనూనె , ఉప్పులో ఉండే సహజ యాంటీ మైక్రోబియల్ గుణాలు,

 యాంటీ సెప్టిక్ లక్షణాలు నోట్లో ప్రమాదకర బ్యాక్టీరియా నశించిపోతుంది. మరియు నోటి దుర్వాసన చిగుళ్ల సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఎన్నో ఏళ్లుగా గార పట్టిన దంతాలు కూడా

 సహజ తెలుగు కాంతిని పొందుతాయి. అలాగే దంతక్షయాన్ని నివారించే గుణాలు ఉన్న క్యారెట్ను పచ్చిగా నమిలి మింగితే పంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.