మీ ఫోన్ లో ఉన్న ఈ యాప్స్ ఉన్నాయా…. మీరు ప్రమాదంలో ఉన్నట్టే?

 ప్రస్థుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్న పిల్లలు, వృద్దులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు.

 ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచంలో జరిగిన అన్ని విషయాల గురించి ఇంట్లో కూర్చొని తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో అనేక రకాల ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

 స్మార్ట్ ఫోన్ లో అనేక యాప్ లు ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్‌లు, పేమెంట్ యాప్‌లు, ఎడిటింగ్ యాప్‌లు ఇలా ఎన్నో యాప్ లు గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగా లభ్యమవుతాయి.

 అయితే, వీటిలో కొన్ని యాప్‌లు ప్రమాదకరమైనవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల యాప్స్ ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే హ్యాకర్లు ఫోన్‌ను క్యాప్చర్ చేసి,

 ఆ వ్యక్తి గత సమాచారాన్ని దొంగలిస్తారు. ఇలా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల డేటాను దొంగిలిస్తున్న కొన్ని హానికరమైన యాప్ లను

 థాయ్ ల్యాండ్ కి చెందిన డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కొనుగొంది.

 ఈ యాప్స్ లో చాలా వరకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించినప్పటికీ, ఒకవేళ మీరు మీ స్మార్ట్ ఫోన్ లో ఇప్పటికే ఈ యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకుని వినియోగిస్తున్నట్లైతే,

 వెంటనే వాటిని తొలగించాలి. మీ ఫోన్ లో ఉన్న ప్రమాదకరమైన యాప్స్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 4కే ప్రో కెమెరా, 4కే వాల్ పేపర్స్ ఆటో ఛార్జర్, అడ్వాన్స్డ్ ఎస్ఎంఎస్, ఐపిక్ – మ్యాజిక్ ఫోటో ఎడిటర్, అల్ గుడ్ పీడీఎఫ్ స్కానర్, ఆర్ట్ ఫిల్టర్స్, ఆస్ట్రో + హోరోస్కోప్,

 ఆస్ట్రోలైన్: డైలీ హోరోస్కోప్, ఆటో స్టిక్కర్ మేకర్ స్టూడియో,  బేబీ స్టిక్కర్ – ట్రాక్ మైల్ స్టోన్స్, బాస్ బూస్టర్ వాల్యూమ్ పవర్ యాంప్, బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్స్ బబుల్ – ఎఫెక్ట్స్,

 బీట్ మేకర్ ప్రో, బ్యూటీ ఫిల్టర్, బ్లడ్ ప్రెషర్ చెక్, బ్లడ్ ప్రెషర్ డైరీ, బ్లూ స్కానర్, బ్లర్ ఇమేజ్, కాలర్ థీమ్, కాల్ మీ ఫోన్ థీమ్స్, కాల్ స్కిన్స్, కెమెరా ట్రాన్స్ లేటర్, కేర్ మెస్సేజ్,

 కార్టూన్స్ మీ, క్యాచీ క్లియర్, చాట్ ఆన్ లైన్, చాట్ ఎస్ఎంఎస్, చాట్ టెక్ట్స్ ఎస్ఎంఎస్, క్లాసిక్ ఎమోజీ కీబోర్డ్, క్లాసిక్ గేమ్ మెసెంజర్, కోకో కెమెరా,

 ఎమోజీ థీమ్ కీబోర్డ్, హైపర్ క్లీనర్: క్లీన్ ఫోన్, వంటి మరికొన్ని ప్రమాదకరమైన యాప్స్ ని వెంటనే తొలగించండి.