చిన్న చిన్న పనులు చేస్తేనే అలసిపోయినట్లు ఏదో భారం మోస్తున్నట్లు అనిపిస్తోందా, లేదా కొద్ది దూరం నడిచిన, పరిగెత్తిన, స్వల్ప బరువులు ఎత్తిన తీవ్రమైన అలసట,
ఒళ్ళు నొప్పులు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలతో నిత్యం మీరు బాధపడుతుంటే మీరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని భావించవచ్చు.
ప్రతిరోజు మీరు తీసుకునే ఆహారం మీ శరీర నిత్య జీవక్రియలకు అవసరమైన పోషకాలను అందించట్లేదు కాబట్టి మీలో స్టామినా తగ్గి తొందరగా అలసిపోవడం, చిరాకు పడడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.
మీ శారీరక దృఢత్వాన్ని పెంపొందించి మీలో శక్తిసామర్థ్యాలను రెట్టింపు చేసుకోవడానికి ప్రతిరోజు ఒక ఉడకబెట్టిన గుడ్డును ఆహారంగా తీసుకుంటే
ఇందులో ఉండే ప్రోటీన్స్ మీలో శక్తిని రెట్టింపు చేయడంలో సహాయపడి అలసట నీరసం వంటి లక్షణాలను తొలగిస్తుంది.
మీ శారీరక బరువును నియంత్రించి మీలో శక్తి సామర్థ్యాలను పెంపొందించే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్స్ అధికంగామూడుసార్లు ఉండే చేపలను వారంలో కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్ ను ఆహారంగా తీసుకుంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడంవల్ల జీర్ణం అవడంలో ఆలస్యం జరిగి మిమ్మల్ని తొందరగా అలసిపోనివ్వదు.
మీలో అలసట, ఒత్తిడి ఒత్తిడి నీరసం వంటి లక్షణాలు తలెత్తినప్పుడు అరటిపండును తింటే ఇందులో సమృద్ధిగా లభించే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మీలో తక్షణ శక్తిని కలిగించి మీ శరీరాన్ని రిఫ్రెష్ చేయడంలో సహాయపడుతుంది.
మీ స్టామినాను రెట్టింపు చేసే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ ఫైబర్ పుష్కలంగా ఉండే బీన్స్,చిక్కుడు జాతి కాయగూరలను రోజువారి ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.
విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి విటమిన్ డి, విటమిన్ ఏ సమృద్ధిగా కలిగిన ఆకుకూరలను రోజువారి ఆహారంలో చూసుకుంటే పోషకాహార లోపం తొలగిపోయి శారీరక, మానసిక ఒత్తిడి తొలగిపోతుంది.