దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వంకాయ కూరకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అన్ని పండుగలు, శుభకార్యాలో తప్పనిసరిగా గుత్తి వంకాయ కూర ఉండాల్సిందే. వంకాయ అద్భుతమైన రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
శాకాహారులకైతే తప్పనిసరిగా గుత్తి వంకాయ కూర ఉండాల్సిందే. ముఖ్యంగా వంకాయలో మన శరీర జీవక్రియలకు అవసరమైన విటమిన్ బి3,
విటమిన్ b6, ఫైబర్, పోలేట్, పొటాషియం, మెగ్నీషియం, వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
తరచూ వంకాయను ఆహారంగా తింటే ఇందులో ఉండే పోషక పదార్థాలు రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
అలాగే వంకాయలు సమృద్ధిగా లభించే పీచు పదార్థం మలబద్ధకం గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను తొలగించి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
వంకాయ తరచూ తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థం శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి ఉబకాయ సమస్యను దూరం చేస్తుంది.
వంకాయలో సమృద్ధిగా ఉండే పొటాషియం రక్తపోటు గుండెపోటు ముప్పును తగ్గిస్తుంది. వంకాయలు ఫైబర్ కంటెంట్ నీటి నిల్వలు సమృద్ధిగా లభిస్తాయి
కావున శరీర బరువు తగ్గించుకోవాలనుకునేవారు వంకాయలు రోజువారి డైట్ లో చేర్చుకోవచ్చు. అలాగే శరీరాన్ని ఎల్లప్పుడు హైడ్రేట్ గా ఉంచి జీవక్రియలను నియంత్రిస్తుంది.
శరీరంలోనీ వ్యాధికారక మలినాలను విసర్జించడంలో వంకాయ లోని ఔషధ గుణాలు అద్భుతంగా పనిచేస్తాయి.
వంకాయలు సమృద్ధిగా లభించే పోలేట్, విటమిన్ b6 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడి అవయవాల పనితీరును మెరుగు పరుస్తాయి.