సాధారణంగా డెలివరీ తర్వాత మహిళల శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి.శరీరం మొత్తం పూర్తిగా మారిపోవడం వల్ల కొంతమంది
డెలివరీ అయిన తర్వాత అధిక శరీర బరువు పెరుగుతుంటారు. ఈ క్రమంలోనే ఈ శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.
ఈ విధంగా డెలివరీ తర్వాత శరీరం బరువు పెరిగిన మహిళలు తొందరగా శరీర బరువు తగ్గాలంటే ఈ సింపుల్ వంటింటి చిట్కాలను పాటిస్తే చాలు.
మహిళలు ప్రెగ్నెన్సీ మరియు డెలివరీ తరువాత చాలా రోజులపాటు శారీరక శ్రమ కలిగిన వ్యాయామాలు, నడక, రన్నింగ్ వంటివి చేయలేరు
కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి అతి బరువు సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలకు మన ఇంట్లోనే వంటింటి చిట్కాలను ఉపయోగించి సహజ పద్ధతిలో
శరీర బరువును తగ్గించుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.ప్రెగ్నెన్సీ తర్వాత మహిళలు మానసిక ప్రశాంతత అలవర్చుకొని
స్వల్ప శారీరక శ్రమ కలిగిన వ్యాయామాలు చేయడం ఎంతో మంచిది అంటే కొంతసేపు నడవడం చిన్నచిన్న పనులు చేయడం ఎంతో అవసరం.
డెలివరీ అయిన మహిళలు వేడి నీళ్లు తాగాలని చెబుతారు అయితే పూర్తిగా వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటిని తాగటం వల్ల
శరీర జీవక్రియ రేటు పెరిగి శరీరంలోని చెడు మలినాలు తొలగించబడతాయి. కాఫీ టీలకు బదులు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న
గ్రీన్ టీ లో తేనె కలుపుకొని ప్రతిరోజు సేవిస్తే శరీర బరువు తొందరగా తగ్గుతుంది.
మన వంటింట్లో కచ్చితంగా ఉండే దాల్చిన చెక్క లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియన్ గుణాలు పుష్కలంగా ఉంటాయి
కావున ఒక గ్లాసు నీటిలో 2 నుంచి 3 లవంగాలు వేసి దాల్చిన చెక్క ముక్క వేసి బాగా మరిగిన తర్వాత గోరువెచ్చగా ఉన్న కషాయాన్ని సేవిస్తే మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తరిగిపోతుంది.