మహిళలు ఇంట్లో తల దువ్వుతున్నారా…. ఈ సమస్యలు తప్పవు!

 మనలో చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంచాలి అనేది వాస్తు శాస్త్రాన్ని అనుసరించి చేస్తుంటారు.

 ఇల్లు నిర్మించే సమయంలో కూడా వాస్తుకి అనుగుణంగా నిర్మిస్తారు. చాలామంది వాస్తు ప్రకారం ఏ రోజు ఎటువంటి రంగు దుస్తులను వేసుకుంటే మంచి కలుగుతుంది అనేది తెలుసుకొని అనుసరిస్తూ ఉంటారు.

 వీరు వాస్తు నియమాలకు విరుద్ధంగా ఎటువంటి పని చేయరు. అలా చేయడం వల్ల తమ జీవితంపై చెడు ప్రభావం కలుగుతుందని వీరు నమ్ముతారు.

 కానీ కొన్ని విషయాలను చిన్నవే కదా అని తేలికగా వదిలేస్తారు. అలాంటివే మీద దుష్ప్రభావాలు చూపుతాయి. వాటిలో కొన్ని తెలుసుకుందాం…..

 ఆడవారు ఇంట్లో ఎప్పుడు జుట్టు వీరబోసుకుని తిరగకూడదు. ఇంట్లో ఎప్పుడూ కూడా తల దువ్వుకోకూడదు. ఇలా నటింట్లో కూర్చొని తల దువ్వుకోవడం వల్ల దరిద్రం తిట్టుకుంటుంది.

 అంతే కాకుండా ఇలా చేయడం వలన ఇంట్లో తల వెంట్రుకలు రాలుతాయి. నట్టింట్లో వెంట్రుకలు రాలడం అనేది శని దేవుడికి ఆహ్వానంగా పరిగణిస్తారు.

 ఇలా చేయటం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని పండితులు చెబుతూ ఉంటారు. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు జుట్టు విరబోసుకుని మహిళలు ఎదురు వచ్చినా కూడా ఆ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి .

 అంతేకాకుండా వాస్తునియమాల ప్రకారం మంగళవారం రోజున మహిళలు జుట్టు కత్తిరించుకోకూడదు. మంగళవారం రోజు జుట్టు కత్తిరించటం అశుభమని చెబుతుంటారు.

 అలాగే సాయంత్రం సంధ్య సమయం తర్వాత కూడా మహిళలు తల దువ్వుకోవడం వల్ల కూడా ఆ ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చుని గోళ్ళు కత్తిరించకూడదు.

 ఇది చాలా అశుభం. ఇవి వినడానికి చాలా చిన్న విషయాలు, కానీ వీటి వలన ప మనము చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. మహిళలు జుట్టు విరబోసుకుని పూజలు చేయకూడదు.

 మహిళలు జుట్టుని వీరబోసుకోకుండ, కట్టుకొని ఇంట్లో పనులు చేసుకోవడం వలన వాస్తు దోషాలను దరిచేరకుండా చూసుకోవడం మంచిది.