గర్భం ధరించిన మహిళలు వారి ప్రెగ్నెన్సీ సమయంలో ఎంత బరువు పెరగాలో తెలుసా?

సాధారణంగా ఒక మహిళ గర్భం దాల్చింది అంటే తన ఆరోగ్య విషయంలో ఎన్నో అపోహలు భయాందోళనలకు గురవుతూ ఉంటారు.

ఇలా చాలామంది అపోహలో ఉన్నప్పుడు ఎన్నో అనుమానాలు కూడా తలెత్తుతూ ఉంటాయి

ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళ ప్రెగ్నెన్సీ సమయంలో శరీర బరువు పెరగడం విషయంలో చాలామంది ఎన్నో అపోహలు పడుతూ ఉంటారు

నిజంగానే గర్భంతో ఉన్న మహిళ అధిక శరీర బరువు పెరగాల లేక నిర్ణీత బరువులో ఉండాలా అనే విషయంలో చాలామంది అపోహ పడుతుంటారు

మరి గర్భం దాల్చిన మహిళ ఎంత బరువు పెరగాలి అనే విషయానికి వస్తే….సాధారణంగా గర్భం దాల్చిన మహిళ మొదటి మూడు నెలలలో వాంతులు ,

తలనొప్పి వికారం మట్టి సమస్యలతో బాధపడతారు ఈ క్రమంలోనే శరీర బరువు పెరగడం కన్నా తగ్గడం జరుగుతుంది

అయితే వాంతులు అవుతున్నప్పటికీ వారు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

మూడు నెలలు దాటిన తర్వాత చాలామందిలో ఈ వాంతుల సమస్య ఉండదు కనుక అనంతరం పోషక విలువలు ఖనిజలవనాలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం.

ఇలా బలవర్ధకమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ తొమ్మిది నెలల కాలంలో ఒక మహిళ 10 నుంచి 12 కిలోల వరకు బరువు పెరగాలి.

ఇలా పది నుంచి 12 కిలోల వరకు బరువు పెరిగితేనే ఆ మహిళ సరైన ఆరోగ్యంతో ఉందని పుట్టబోయే బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా పుడతారని అర్థం

అలా కాకుండా అధిక బరువు పెరిగితే ఆ ప్రభావం బిడ్డ ఆరోగ్యంపై పడే అవకాశాలు ఉన్నాయి.

అందుకే గర్భం దాల్చిన తర్వాత మహిళా తప్పనిసరిగా డెలివరీ అయ్యేలోపు 10 నుంచి 12 కిలోలు బరువు పెరగడం ఎంతో అవసరం.