“వాల్తేరు వీరయ్య” పార్ట్ 2 పై డైరెక్టర్ క్రేజీ హింట్.!

 ఒకప్పుడు మన తెలుగు లోనే కాకుండా ఇండియా సినిమా దగ్గర కూడా సీక్వెల్ సినిమాలు అంటే ఓ భయం పట్టుకుంది.

 మొదటి సినిమా హిట్ అయినంత మాత్రం రెండో సినిమా హిట్ అవ్వాలని లేకుండా భారీ ప్లాప్ లు అయ్యేవి ఏవో అరకొర సినిమాలు తప్ప మరో సినిమాలు అయితే అస్సలు మెప్పించలేదు.

 దీనితో సీక్వెల్ సినిమాలు అనే మాట కి చాలా మంది దర్శకులు గాని హీరోలు గాని దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

 సీక్వెల్ సినిమాలపై ఎనలేని హైప్ ఇప్పుడు ఆడియెన్స్ లో కనిపిస్తుంది. దీనితో అవి అంచనాలు అందుకునే మరింత స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి.

 ఇక లేటెస్ట్ గా అయితే టాలీవుడ్ లో రిలీజ్ కి రాబోతున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” సినిమాకి సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్నకి లేటెస్ట్ ఇంటర్వ్యూ లో బాబీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు.

 ఈ సినిమాకి పార్ట్ 2 ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా హింట్ ఇస్తూ అన్నీ సెట్టయితే ఉండొచ్చు అనే సమాధానం ఇచ్చాడు.

 దీనితో అయితే ఒకవేళ వాల్తేరు వీరయ్య కానీ అంచనాలు అందుకుంటే నెక్స్ట్ వాల్తేరు వీరయ్య పార్ట్ 2 కూడా ఉంటుంది అని చెప్పొచ్చు.

 మరి ఈ జనవరి 13న వచ్చే ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

 ఇక ఈ సినిమాలో రవితేజ కూడా ఓ కీలక పాత్ర చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.