మీరు చేసే ఈ తప్పులు లైంగిక జీవితంపై ప్రభావం చూపుతాయని తెలుసా?

ఒక మనిషి జీవితంలో సంతోషంగా ఉండటానికి నిద్రాహారాలు డబ్బు ఎంత అవసరమో లైంగిక జీవితం గడపడం కూడా అంతే అవసరమని చెప్పాలి.

ఇలా లైంగిక జీవితంలో పాల్గొనడం వల్ల శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు.

అయితే కొన్నిసార్లు మనం చేసే తప్పుల వల్ల ఆ ప్రభావం మన లైంగిక జీవితం పైపడుతుంది. దీంతో లైంగిక జీవితంలో ఏమాత్రం సంతోషంగా గడపలేరు.

మరి మనం చేసే ఆ తప్పులు ఏంటి? ఆ తప్పులు లైంగిక జీవితం పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే విషయానికి వస్తే…

ఈ ఉరుకుల పరుగుల కాలంతోపాటు మనిషి కూడా పరుగులు తీస్తూ ఎక్కువ సమయం పాటు పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

తద్వారా అధిక ఒత్తిడికి గురవుతున్నారు ఎప్పుడైతే మనిషి పని ఒత్తిడి కి గురవుతారో ఆ ప్రభావం తప్పనిసరిగా సెక్స్ జీవితంపై పడుతుంది.

ఎప్పుడైతే అధిక ఒత్తిడికి గురవుతామో ఆ సమయంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ల అణిచివేతకు కారణం అవుతుంది. ఇక నిద్రలేమి సమస్య కారణం కూడా లైంగిక జీవితం పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

ప్రతిరోజు అధిక ఒత్తిడితో పనిచేస్తూ నిద్రలేని సమస్యతో బాధపడుతుంటారు.

ఇలా ఎప్పుడైతే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారో అలాంటివారు సెక్స్ జీవితంపై పెద్దగా ఆసక్తి కనపర్చరు. అందుకే మధ్యాహ్నం సమయంలో కాస్త నిద్రకు సమయం కేటాయించాలి.

అదేవిధంగా మన ఆహార విషయంలో కూడా పూర్తిగా మార్పులు చేసుకోవాలి. ఇక భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు రావడం సర్వసాధారణం.

అయితే ప్రతి విషయంలోనూ గొడవ పడుతూ ఆ గొడవను పెద్దది చేస్తూ పోవడం వల్ల ఆ ప్రభావం సెక్స్ జీవితంపై కూడా ఎక్కువగా పడుతుందని చెప్పాలి.

అందుకే ఈ పొరపాట్లు చేయకుండా ఉంటే సెక్స్ లైఫ్ ఎంతో సంతోషంగా ఉంటుంది.