సాధారణంగా చాలామంది అన్నం తయారు చేసే సమయంలో కొందరు గంజి ఉంచకుండా అలాగే అన్నం తయారు చేస్తారు
అలాగే మరికొందరు గంజి మొత్తం వంచేసి అన్నం తయారు చేస్తారు.ఇలా గంజి మొత్తం వంచి అన్నం చేయడం వల్ల మనకు
ఆహారంలో ఉన్నటువంటి పోషక విలువలు ఆ గంజి ద్వారా బయటకు వెళ్లిపోతాయి అప్పుడు మనం కేవలం వట్టి ఆహారం మాత్రమే తీసుకుంటాము.
అందులో ఎలాంటి పోషక విలువలు ఉండవు.ఇలా అన్నం వంచిన తర్వాత మనం పడేసే ఆ గంచిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు
కనుక తెలిస్తే ఇకపై ఎవరూ కూడా ఆ గంజిని పారబోయరు.మరి మనం అన్నం వంచే గంజిలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే…
గంజిలో అధిక పోషకాలు ఉంటాయి. విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. గంజి తాగడం వల్ల శరీరానికి త్వరిత శక్తి అందుతుంది,
దీని వల్ల శరీరం యొక్క అలసట చాలా వరకు పోతుంది. గంజిలో ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల
ముఖంలోని బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి. తరచూ ఈ గంజి తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదాలు కూడా తగ్గిపోతాయి.
ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు జుట్టు తెల్లబడటం జరుగుతుంది. ఇలా జుట్టు తెల్లబడటం,
రాలిపోయే సమస్యలు ఉన్నవారు గంజి చల్లారిన తరువాత తలకు రాసి ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచి అనంతరం తేలికపాటి షాంపూతో తల స్నానం చేసి
కండిషనర్ అప్లై చేయడం వల్ల ఈ తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడటమే కాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది
ఇక ఈ గంజిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను కూడా తగ్గిస్తుంది.ఇక ఈ గంజిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను కూడా తగ్గిస్తుంది.