డ్రైవింగ్ లైసెన్స్ ఇంట్లోనే మర్చిపోయారా… ఈ సింపుల్ పద్ధతులను పాటిస్తే ఫైన్ కట్టాల్సిన పని లేదు తెలుసా?

 సాధారణంగా ఒక ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు లేదా ఇతర వాహనాలను ప్రయాణం చేస్తూ వెళ్లేటప్పుడు తప్పనిసరిగా వారితో పాటు ఆర్సి డ్రైవింగ్ లైసెన్స్

 వంటి కొన్ని డాక్యుమెంట్స్ వెంట తీసుకెళ్లడం ఎంతో ముఖ్యం. కొన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులు లేదా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు మనల్ని ఆపి తప్పనిసరిగా బండికి సంబంధించిన కాగితాలను

 మన డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా అడుగుతుంటారు ఇలాంటి సమయంలో మనం డ్రైవింగ్ లైసెన్స్ చూపించినప్పుడు తప్పనిసరిగా

 అధికారులు మనకు తగినంత జరిమానా విధిస్తూ ఉంటారు. అయితే ఇలా పోలీసుల ఆపినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఇంట్లో మరిచిపోయామని ప్రతి ఒక్కరు చెప్పే మొదటి అబద్ధం.

 ఈ విధంగా ట్రాఫిక్ పోలీసుల దగ్గర అబద్ధాలు చెప్పకుండా ఫైన్ కట్టకుండా ఈ చిన్న పద్ధతులను పాటిస్తే చాలు మీరు సేఫ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు.

 మీ దగ్గర లైసెన్స్, ఆర్‌సీ లేకపోయినా పర్లేదు.. ఈ ఒక్క యాప్ ఉంటే చాలు. మరి అదేంటో తెలుసుకుందాం. Digi Locker’.. ఈ యాప్‌లో మీరు ముఖ్యమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు.

 డ్రైవింగ్ లైసెన్స్‌, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటికి ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇందులో సేవ్ చేసుకోవచ్చు.

 డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పోలీసు చెకింగ్ దగ్గర ఆపినట్లయితే.. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా.. ఈ డిజిలాకర్ యాప్‌లోని DL హార్డ్ కాపీని

 చూపిస్తే చాలు మీరు ఎలాంటి చలానా కట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. డిజిటల్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని వాహనం నడపటానికి

 అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌ను ఒకే చోట పొందేలా పలు యాప్ లను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది వాటిలో Digilocker, mParivahan మొబైల్ యాప్‌ ఒకటి.

 ఈ యాప్ ద్వారా మీకు సంబంధించిన అన్ని విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఇందులో సేవ్ చేసుకొని ఎక్కడికైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లవచ్చు.