ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరి బిగ్గెస్ట్ కాంబినేషన్ మరియు భారీ బడ్జెట్ చిత్రంలలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్
సూపర్ స్టార్ మహేష్ బాబు తో ప్లాన్ చేసిన సినిమా కూడా ఒకటి. మరి ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా
తెరకెక్కుతూ ఉండగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా కాకుండానే 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
ఇక మహేష్ సినిమా అంటేనే భారీ అంచనాలు మార్కెట్ అనేది కామన్.
ఇప్పుడు షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుపుకుంటున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ పై నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ పలు క్రేజీ కామెంట్స్ చేశారు.
ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో అయితే ఇంచు మించు రాజమౌళి రికార్డ్స్ దగ్గరకి వచ్చేస్తుంది అని తెలిపాడు.
అది కూడా అన్ని ఏరియాల్లో భారీ రికార్డులు సెట్ చేస్తుంది అని ఇప్పుడు నుంచే అనేస్తున్నారు.
మరి ఇది కాన్ఫిడెన్స్ అనుకోవాలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో కానీ మహేష్ ఫ్యాన్స్ లో మాత్రం ఇప్పుడు అంచనాలు మరింత పెరిగాయి.
ఆల్రెడీ ఈ సినిమా ఓ భారీ ఏక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.
పైగా మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ కావడంతో హైప్ గట్టిగా ఉంది.
మరి వారు చెప్పినంత సీన్ ఉందో లేదో అంత పెద్ద హిట్ గా ఇది నిలుస్తుందో లేదో చూడాలి.
ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే మరియు శ్రీ లీల లు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.