“వాల్తేరు వీరయ్య” అన్నంత పని చేశాడా.?

 ఈ సంక్రాంతి కానుకగా భారీ పోటీలో టాలీవుడ్ దగ్గర వచ్చిన మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా

 మాస్ మహారాజ రవితేజ మరో హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ సాలిడ్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి,

 మరి ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కించగా కేథరిన్ మరియు శృతి హాసన్ లు హీరోయిన్స్ గా నటించారు.

 మరి ఈ భారీ సినిమా అయితే ఈరోజు తెల్లవారు తోనే యూఎస్ లో సహా తెలంగాణాలో 4 గంటల షో లతో స్టార్ట్ అయ్యిపోయింది.

 మరి ఈ రావడంతోనే సినిమా రిజల్ట్ కూడా ట్విట్టర్ నుంచి రివీల్ చేస్తున్నారు.

 మరి పూనకాలు లోడింగ్ అంటూ వచ్చిన ఈ చిత్రం అన్నంత పని చేసిందా లేదా అంటే అసలు డౌట్ లేకుండా చేసింది అని టాక్ వచ్చేసింది.

 సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్ లా వచ్చింది. బాబీ చెప్పినట్టుగానే మళ్ళీ పాత మెగాస్టార్ ని ప్రెజెంట్ చేసినట్టుగా ఆడియెన్స్ అంటున్నారు.

 చిరు నుంచి ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా సినిమాలో ఉన్నాయట. అలాగే రవితేజ కూడా సినిమాలో బిగ్ ప్లస్ అయ్యాడని అంటున్నారు.

 కానీ కొన్ని అంశాలు మాత్రం అంతగా మెప్పించలేదని కొందరు అంటున్నారు. అలాగే కొందరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుండడం విశేషం.

 ఇక సినిమాలో ఇంటర్వెల్ బాంగ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అదిరినట్టు తెలుస్తుంది.

 దీనితో ఓవరాల్ గా వాల్తేరు వీరయ్య హిట్ టాక్ నే తెచ్చుకున్నాడు. ఇప్పుడు అసలైన బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు ఏమో.