ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏ తప్పు చేయకపోయినా ప్రభుత్వ ఉద్యోగులకు శత్రువుగా మారారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా పెట్టారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
2019 ఎన్నికల్లో జగన్ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరిగేలా చేయడంలో జగన్ సర్కార్ ఫెయిలవుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ దాదాపుగా ఎలాంటి ప్రయోజనాలను కల్పించలేదు.
ఉద్యోగుల పనితీరును తెలుసుకోవడానికి జగన్ అనుసరిస్తున్న మార్గాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యకమవుతున్నాయి.
ఉద్యోగుల విషయంలో గతంలో ఏ ప్రభుత్వం వ్యవహరించనంత కఠినంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
సరైన సమయానికి ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
జగన పాలనతో ప్రభుత్వ ఉద్యోగులు విసిగిపోతున్నారు. జగన్ ఈ సమస్యలకు ఏ విధంగా చెక్ పెడతారో చూడాలి.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జగన్ మరిన్ని కొత్త నిర్ణయాలను ప్రకటిస్తే బాగుంటుంది.
ప్రభుత్వ ఉద్యోగులను జగన్ దూరం చేసుకోవడం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జగన్ సర్కార్ సమస్యలను పరిష్కరించుకుని ముందడుగులు వేయాల్సి ఉంది. ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించి తప్పులు చేస్తే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.