డిక్కీ బలిసిన కోడి.! మంత్రి రోజాకి తగునా.?

  ఆమె ఒకప్పటిలా కేవలం సినీ నటి కాదు.! జబర్దస్త్ కామెడీ షో జడ్జి కూడా కాదిప్పుడు.! ఓ ఎమ్మెల్యే, పైగా మంత్రి కూడా.!

 రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించే క్రమంలో ‘నోటి దురద’ ప్రదర్శించడం అస్సలేమాత్రం ఆమెకీ, ఆమె పదవికీ గౌరవం కాదు. దురదృష్టమేంటంటే, ఆమె అవన్నీ పట్టించుకోరు.

 కొడాలి నానిని ఈ విషయంలో ఆమె ఆదర్శంగా తీసుకుంటున్నట్టున్నారు. కేవలం ప్రత్యర్థుల్ని తూలనాడితే సరిపోతుందని రోజా అనుకుంటున్నారేమో.!

 అలా చేయడం వల్ల కొడాలి నాని సాధించిందేంటి.? అని ఒక్కసారి రోజా ఆత్మ విమర్శ చేసుకుంటే బెటర్.

 పదే పదే డిక్కీ బలిసిన కోడి.. అనే అరిగిపోయిన పాత రికార్డుని ప్లే చేస్తుంటారు రోజా. నారా లోకేష్‌ని విమర్శించే క్రమంలో రోజా ఈ వ్యాఖ్యలు చేస్తుంటారు.

 వాటి వల్ల రోజాకి రాజకీయంగా కలిగే ప్రయోజనమేంటి.? నారా లోకేష్‌కి కలిగే నష్టమేంటి.? అడ్డదారిలో లోకేష్ మంత్రి అయ్యారని రోజా విమర్శించడంలో అర్థమే లేదు.

 అది జరిగిపోయిన కథ. ఆయన ఏ దారిలో మంత్రి అయినా.. ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయన టెర్మ్ ముగిసింది. అది వేరే వ్యవహారం.

 ఎమ్మెల్యేగా రోజా, తన నగిరి నియోజకవర్గానికి ఏం చేశారు.? మంత్రిగా రాష్ట్రానికి ఆమె ఏం చేయగలుగుతున్నారన్నది ముఖ్యమిక్కడ.

 పైగా, సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచి రోజా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారాయె.

 ఈ ‘డిక్కీ బలిసిన’ మాటల్ని మానేసి, మంత్రి పదవికి హుందాతనం తెచ్చేలా ఆమె వ్యవహరించడం, ఆమెకే మంచిది.