డైమండ్ రాణి.! పవన్ కళ్యాణ్ ఆనాటి పగ అది.!

 ‘డైమండ్ రాణి.. నువ్వు కూడానా.?’ అంటూ అదోలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్ వేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

 లక్షలాది మంది యువత హాజరైన ‘జనసేన యువశక్తి’ కార్యక్రమంలో సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన రోజా మీద పవన్ కళ్యాణ్ ఇంత ‘తేలిక’ వ్యాఖ్యలు ఎందుకు చేసినట్లు.?

 విషయం చాలానే వుందంటూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అది ప్రజారాజ్యం పార్టీ నాటి వ్యవహారం.

 అప్పట్లో ప్రజారాజ్యం మహిళా నేతలకీ, టీడీపీ మహిళా నేతలకీ మధ్య మాటల యుద్ధం జరిగింది.

 ఇప్పుడు వైసీపీలోనే వున్నారు ఆ ఇద్దరు మహిళా నేతలు. వారికి అదనంగా ఇంకో మహిళా నేత, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వున్నారు.

  వైసీపీలో వున్న ఇద్దరు మహిళా నేతల్లో ఒకరైన రోజా, గతంలో టీడీపీలో వుండేవారు. ఇంకో మహిళా నేత వాసిరెడ్డి పద్మ, అప్పట్లో ప్రజారాజ్యం నేత.

 చిరంజీవిని విమర్శించే క్రమంలో రోజా అప్పట్లో హద్దులు మీరారు, దానికి కౌంటర్ ఎటాక్ వాసిరెడ్డి పద్మ తదితరులు గట్టిగా ఇచ్చారు.

 ఆ మహిళా నేతల్ని నిలదీయాల్సిన రోజా, పవన్ కళ్యాణ్ అప్పటి సతీమణి రేణు దేశాయ్ మీద అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారు.

 చిరంజీవి మీదా మాటలు తూలారు. అప్పటి ఆ విషయాల్ని పవన్ కళ్యాణ్ మనసులో పెట్టుకున్నట్టున్నారు.

 తనను పదే పదే ప్యాకేజీ స్టార్ అంటూ రోజా విమర్శించడాన్ని జీర్ణించుకోలేకపోయిన పవన్ కళ్యాణ్, ‘డైమండ్ రాణి’ అంటూ తూలనాడారు. అద్గదీ అసలు సంగతి.